News
News
X

Republic Day 2023: రిపబ్లిక్ డే పరేడ్‌లో మెరిసిన స్త్రీశక్తి - త్రివిధ దలాళ్లోనూ మహిళా అధికారులే!

Republic Day 2023: ఈసారి గణతంత్ర దినోత్సవాల్లో స్త్రీ శక్తి మెరిసింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగిన పరేడ్ లో త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులే నాయకత్వం వహించారు.

FOLLOW US: 
Share:

Republic Day 2023: గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన వేడుకల్లో మహిళా శక్తి మెరిసింది. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంది. జనవరి 26వ తేదీన నిర్వహించే పరేడ్ లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట, పాటలతో అద్భుతంగా సాగింది. అయితే ఈశారి "మన శక్తి"లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలించింది. పరేడ్ లో పాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. కానీ ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వం స్థానం దొరికింది. 

నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా పని చేస్తున్న 29 ఏళ్ల లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్.. 144 మంది నావికులతో కూడి కవాతు బృందానికి నాయకత్వం వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్-17 పైలట్ గా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించారు. మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ కు లెఫ్టినెంట్ ఆకాశ్ శర్మ నాయకత్వం వహించారు. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో మేజర్ మహిమ కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ బృందాల నాయకత్వంలో పాల్గొన్నారు. 

రాజధానిలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర పరేడ్‌ కూడా బాగా జరిగింది. సైనిక శక్తి సామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రాంతాలకు తగ్గట్లుగా సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతోపాటు మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రబల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ముందు ఎద్దుల బండి, వెనుక సంక్రాంతి పండుగను చాటేలా అలంకరించారు. అలాగే గుజరాత్‌, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడిపాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికి పాటుపడతాం అనే థీమ్ తో త్రిపుర శకటం ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ స్త్రీతత్వం థీమ్ తో శకటాలను నడపింది.

ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభమైంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ప్రధాని మోదీ గణతంత్ర వేడుకల వద్దకు వచ్చారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరయ్యారు. సైనిక పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంది.

Published at : 26 Jan 2023 02:40 PM (IST) Tags: India News Women Power Republic Day 2023 74th Republic Day Parade 2023 Republic Day Celebrations

సంబంధిత కథనాలు

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Bhopal-New Delhi Vande Bharat: మరో వందేభారత్‌ ట్రైన్‌ ప్రారంభించిన ప్రధాని, ఈ సారి ఆ రాష్ట్రంలో

Bhopal-New Delhi Vande Bharat: మరో వందేభారత్‌ ట్రైన్‌ ప్రారంభించిన ప్రధాని, ఈ సారి ఆ రాష్ట్రంలో

Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్‌ హత్యా బెదిరింపుల కేసులో నిందితుడి అరెస్ట్, కొనసాగుతున్న విచారణ

Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్‌ హత్యా బెదిరింపుల కేసులో నిందితుడి అరెస్ట్, కొనసాగుతున్న విచారణ

Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు

Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు

Emergency At Airport: విమానం టేకాఫ్‌ కాగానే ఢీకొట్టిన పక్షి, ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ

Emergency At Airport: విమానం టేకాఫ్‌ కాగానే ఢీకొట్టిన పక్షి, ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ

టాప్ స్టోరీస్

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...