Project cheetah: చీతాల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఊరట, సమర్ధించిన సుప్రీంకోర్టు
Project Cheetah: ప్రాజెక్టు చీతా అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. భారత్ లో చీతాలను తిరిగి ప్రవేశపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించేందుకు ఏ కారణం లేదని స్పష్టం చేసింది.
Project Cheetah: ప్రాజెక్టు చీతా అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. భారత్ లో చీతాలను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించేందుకు ఎలాంటి కారణం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు సమర్ధించింది. నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చిన 20 చీతా లాల్లో ఆరు చీతాలతో పాటు మూడు కూనలు మృతి చెందాయి. దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది.
1952 తర్వాత భారత్ లో చీతాలు అంతరించిపోయినట్లు ప్రకటించిన తర్వాత సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతా ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుండి 20 చీతా లను భారత్ కు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మగ చీతా ఏప్రిల్ 23న మృతి చెందాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతా ల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మే 9న మృతి చెందింది. అదే నెలలో జ్వాలా అనే చీతా కు పుట్టిన నాలుగు కోణాల్లో మూడు చనిపోయాయి. ఈ నెలలో మూడు మరణాలతో కలిపి మొత్తం వీటి మరణాల సంఖ్య 9 కి చేరింది.
మరోవైపు చీతా ల కదలికలను గుర్తించేందుకు వాటి మెడలో వేసిన రేడియో కాలర్ల వల్లే అవి మృతి చెందుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల వాటిని కూడా తొలగించారు. అయినా ఇటీవల మరో చీతా ప్రాణాలు కోల్పోవడంతో సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వీటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయస్థానం చీతా లను భారత్ లో తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం సమర్ధించింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ప్రాజెక్టు చీతా కు సంబంధించి తీవ్ర కసరత్తు చేశామని, ప్రతి ఏటా 12-14 చీతా లను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రాణాలికలు రచించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. కొన్ని సమస్యలు వస్తున్న మాట వాస్తవమేనని, అయితే వాటన్నింటినీ అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాటితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం చీతా లు మృతి చెందుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.