Rat Steals Necklace : డైమండ్ నెక్లెస్ చోరీచేసిన ఎలుక, ప్రియురాలికి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్
Rat Steals Necklace : అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో బంగారం షాపులోకి ఎంటర్ అయింది. టైం చూసి డైమండ్ నెక్లెస్ నొక్కేసింది. ఈ చోరీ సీసీ కెమెరాలో రికార్డు అయింది. అయితే దొంగ ఎవరో తెలిసి షాపు సిబ్బంది షాక్ అయ్యారు.
Rat Steals Necklace : మనుషులకేనా సోకులు, ఛాన్స్ దొరికితే మేం కూడా ఎందులోనూ తగ్గేదే లే అంటుంది ఓ ఎలుక. ఇంట్లో భార్య కోరిందో లేక ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకో తెలియదు కానీ ఖరీదైన డైమండ్ నెక్లెస్ ను చోరీ చేసింది. ఎవరూ లేని సమయంలో నగల షాపులోకి సీక్రెట్ గా ప్రవేశించిన ఎలుక అదునుచూసి గోల్డ్ నెక్లెస్ తో జంప్ అయింది. మనుషులే బంగారం వేసుకోవాలా? మేం వేసుకోకూడదా? అంటూ ఓ ఎలుక డైమండ్ నెక్లెస్ చోరీ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళలోని కాసర్ గడ్ లోని ఓ నగల దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమ్మకానికి పెట్టిన నెక్లెస్ లను కస్టమర్లకు కనిపించే విధంగా డిస్ ప్లే లో పెట్టారు నిర్వాహకులు. అలా పెట్టిన ఓ నెక్లెస్ సడెన్ గా మాయమైంది. దీంతో కంగారు పడిన సిబ్బంది సీసీ కెమెరాలు చెక్ చేశారు. అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.
అవాక్కైన షాపు సిబ్బంది
ఓ ఎలుక ఖరీదైన నెక్లెన్ ను సిబ్బంది గుర్తించారు. రాత్రి సమయంలో నగల దుకాణం సీలింగ్ నుంచి ఓ ఎలుక బయటకు వచ్చి డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లస్ ను చాకచక్యంగా ఎత్తుకెళ్లింది. అటూ ఇటూ చూసి ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకుని చటుక్కున నెక్లస్ నొక్కోసింది ఆ ఎలుక. నెక్లెస్ ను నోట నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. ఎలుక చేసిన పని చూసి షాపు సిబ్బంది షాక్ తిన్నారు. నెక్లెస్ ను ఎలుక ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే దగ్గర పడింది కాదా, తన లవర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకు నెక్లెస్ చోరీ చేసి ఉంటుందని ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలుకలు కూరగాయలు, ధాన్యాలు మాత్రమే ఎత్తుకెళ్లడం చూశాం, ఇది సరికొత్త చోరీ అంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
#अब ये चूहा डायमंड का नेकलेस किसके लिए ले गया होगा.... 🤣🤣 pic.twitter.com/dkqOAG0erB
— Rajesh Hingankar IPS (@RajeshHinganka2) January 28, 2023
ఐపీఎస్ అధికారి ట్వీట్
ఎలుక చోరీ వీడియోను రాజేష్ హింగస్కర్ అనే ఐపీఎస్ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ ఎలుక ఆ డైమండ్ నెక్లెస్ ఎవరికి తీసుకెళ్లిందో? అనే క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు తీసుకెళ్తోందేమో అని ఒకరంటే, ఈ చోరీ ఫిబ్రవరి 14కు ముందు జరిగింది కనుక కొంచెం ఆలోచించాల్సిందే అని మరొకరు కామెంట్ చేశారు.
Valantine day aa raha hai ,apni girlfriend ko dene ke liye smart boy
— malti punjabi (@malti_punjabi) February 5, 2023