అన్వేషించండి

Rahul Gandhi: కులగణనతో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం- రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Caste census India: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని మరోసారి ప్రకటించారు రాహుల్‌ గాంధీ. అంతేకాదు... 50శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామన్నారు.

Rahul Gandhi on caste census: భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyaya Yatra) లో భాగంగా... బిహార్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణన (caste census) చేపడామని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు... కులగణన ఆధారంగా రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

న్యాయం వైపు వేస్తున్న మొదటి అడుగు 
కాంగ్రెస్ నినాదం 'కౌంట్' (Ginati Kharo) అని అన్నారు రాహుల్‌ గాంధీ. ఎందుకంటే ఇది న్యాయం వైపు వేస్తున్న మొదటి అడుగు అని చెప్పారాయన. బిహార్‌లో నిర్వహించిన కులగణన సర్వేలో 88 శాతం మంది పేదలు దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు చెందినవారే అని తేలిందన్నారు. బీహార్‌ చేపట్టిన కులగణన దేశానికి ఎక్స్-రే లాంటిదని అభివర్ణించారు. దేశంలో పేదలు ఎవరు.. ఎంత మంది ఉన్నారు..? వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించామా? అని ప్రశ్నించారు రాహుల్‌ గాంధీ. వీటన్నింటిని లెక్కించాల్సిన అవసరం లేదా? అని క్వశ్చన్‌ చేశారు. బిహార్‌లో నిర్వహించిన కులగణన ప్రకారం.... పేద జనాభాలో 88శాతం మంది వెనుకబడిన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల వారే అని తేలిందన్నారు. బీహార్ నుంచి వచ్చిన ఈ గణాంకాలు దేశ వాస్తవ పరిస్థితిని నిదర్శనమి అన్నారు. దేశంలోని పేద జనాభా ఏ స్థితిలో జీవిస్తున్నారో కూడా తెలియడంలేదని అన్నారు రాహుల్‌. అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితి (50 percent reservation limit)ని ఎత్తివేయొచ్చని అన్నారాయన. 

పేదల బతుకులు బాగుపరిచేందుకు... రెండు చారిత్రాత్మక దశలను తీసుకోబోతున్నామని అన్నారు రాహుల్‌ గాంధీ. కులాల లెక్కింపు, ఆర్థిక మ్యాపింగ్ (Economic mapping) ఆధారంగా 50శాతం రిజర్వేషన్ పరిమితిని నిర్మూలిస్తామని చెప్పారు. ఈ చర్య దేశాన్ని ప్రతిబింబిస్తుందని... అందరికీ సరైన రిజర్వేషన్లు, హక్కులు అందిస్తుందని చెప్పారు. పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలను రూపొందిస్తే... విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. అందుకే... మేల్కోండి- సర్వం పెంచండి అని పిలుపునిచ్చారు రాహుల్‌ గాంధీ. కులాల లెక్కింపు ప్రజల హక్కు అని, అది కష్టాల చీకట్లోంచి వెలుగు వైపు తీసుకెళ్తుందని అన్నారాయన.

సమగ్ర సామాజిక- ఆర్థిక కులగణన 
ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి సమగ్ర సామాజిక-ఆర్థిక కులగణన దోహదపడుతుందని అన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (Congress leader Jairam Ramesh) అన్నారు. ఆస్తి, అప్పుల భారం, భూమి, ఆదాయానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందని.... దీనివల్ల ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితి తెలుస్తుందని అన్నారు. అంతేకాదు ఏవర్గం సుభిక్షంగా ఉందో... ఏ వర్గం లేమితో పోరాడుతోందో కూడా అర్థమవుతుందని చెప్పారు. 2011 సామాజిక-ఆర్థిక కులగణన నుంచి ఆర్థిక లేమిపై డేటాను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాయన్నారు జైరామ్‌ రమేష్‌. అందుబాటులో ఉన్న సమాచారానికి కుల ఆధారిత డేటాను జోడించడం వల్ల... పాలనలో మెరుగుదల ఉంటుందన్నారు. అయితే సామాజిక- ఆర్థిక కులగణనలో కుల డేటాను ప్రచురించేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించడం విచారకరమని అన్నారు జైరామ్‌ రమేష్‌. మెరుగైన పాలన, మరింత సంపన్నమైన, న్యాయమైన, సామరస్య పూర్వకమైన భారతదేశం కోసం సామాజిక-ఆర్థిక కులగణన చాలా అవసరమని నొక్కి చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget