వెనిజులాలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించి, రాజధాని కారకాస్‌తో సహా పలు నగరాల్లో వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది.
Venezuela Earthquake: వెనిజులాలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం! సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా!
Venezuela Earthquake: వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

- వెనిజులాలో రెండు శక్తివంతమైన భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి.
- ప్రధాని మోదీ సంతాపం తెలిపి, సహాయం అందించడానికి భారత్ సిద్ధమన్నారు.
- తాత్కాలిక అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించి, మరణాలను ధృవీకరించారు.
- మృతుల సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని యూఎస్జీఎస్ అంచనా వేసింది.
Venezuela Earthquake: వెనిజులాలో రెండు శక్తివంతమైన భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. రాజధాని కారకాస్‌తో సహా పలు నగరాల్లో వేలాది భవనాలు శిథిలమయ్యాయి. వెనిజులాలో భూకంపాల వల్ల జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు . వెనిజులాకు సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విపత్తులో ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఆయన సానుభూతి తెలియజేశారు.
ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, "భారత్ తరపున, వెనిజులా ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధితులందరికీ సంఘీభావంగా నిలుస్తాం. సాధ్యమైనంత అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది" అని రాసుకొచ్చారు.
Deeply saddened by the devastation caused by the severe earthquakes in Venezuela.
— Narendra Modi (@narendramodi) June 25, 2026
On behalf of the people of India, I extend our heartfelt condolences to the Government and people of Venezuela, especially to the families who have lost their loved ones. We pray for the speedy…
అత్యవసర పరిస్థితి ప్రకటించిన వెనిజులా
బుధవారం (జూన్ 24) సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలతో పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. అందుకే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు CNN నివేదించింది. మరణాలను అధికారులు ధృవీకరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) చేసిన ప్రసంగంలో, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టాన్ని రోడ్రిగ్జ్ ధృవీకరించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, ఆమె మృతుల సంఖ్యను వెల్లడించలేదు.
🚨 Heartbreaking scenes from Venezuela.
— Nikkhil (@nikkhilbk) June 25, 2026
Devastating double quake... 7.2 & 7.5 back-to-back near Caracas. Buildings collapsing left & right, state of emergency declared. Official toll low for now but USGS warns it could skyrocket into thousands... even 100k+ in worst case.… pic.twitter.com/fQIs5fDU5z
భూకంపం వల్ల మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అంచనా వేసింది. ఈ విపత్తు వల్ల గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని USGS పేర్కొంది. ప్రాథమికంగా మృతుల సంఖ్య ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
Total devastation in Venezuela following a powerful earthquake. Up to 100,000 people are feared dead.
— Dr. Maalouf (@realMaalouf) June 25, 2026
Pray for them, they didn’t deserve this. pic.twitter.com/heMpFeO9Y4
Building collapses during 7,2 and 7,5 back to back earthquakes in #Venezuela on Wednesday. The death toll could be in the thousands. #earthquake pic.twitter.com/e5fzqThcRd
— Said Pulido (@Super_Said) June 25, 2026
Frequently Asked Questions
వెనిజులాలో ఏమి జరిగింది?
వెనిజులా భూకంపాలపై ప్రధాని మోదీ స్పందన ఏమిటి?
ప్రధాని నరేంద్ర మోదీ వెనిజులాలో జరిగిన విధ్వంసంపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
వెనిజులా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి?
రెండు శక్తివంతమైన భూకంపాల తర్వాత, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరణాలు ధృవీకరించబడ్డాయి మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భూకంపం వల్ల సంభవించిన మరణాలపై USGS అంచనా ఏమిటి?
యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అంచనా ప్రకారం, వెనిజులాలో భూకంపం వల్ల మృతుల సంఖ్య లక్ష వరకు ఉండవచ్చు. ఇది గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని సూచిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు






















