అన్వేషించండి

PM Modi Birthday: 73వ ఏట అడుగుపెట్టిన ప్రధాని మోదీ - పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న ప్రముఖులు

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 73ఏట అడుగుపెట్టారు. ఇవాళ మోడీ పుట్టిన రోజు సందర్భంగా.... ప్రముఖులు, దేశ ప్రజలు శుభాకాంక్షలు చెప్తున్నారు. కళాకారులు కూడా తమదైన రీతిలో ప్రధాని మోడీని విష్‌ చేస్తున్నారు.

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని పుట్టినరోజు సంబరాలను బీజేపీ శ్రేణులు ఘనంగా  నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ... గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. దామోదర్ దాస్‌ మోదీ-  హిరాబెన్‌ దంపతుల కుమారుడు. ఆరుగురు సంతానంతో మోదీ మూడవ వాడు. ఒంటరి జీవితం అంటే ఇష్ట‌ప‌డే మోదీ.. చిన్నతనంలో పెద్దలు బలవంతంగా చేసిన పెళ్లిని  తిరస్కరించారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా... ప్రముఖులు, నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు చెప్తున్నారు. కళాకారులు కూడా తమదైన పద్ధతిలో ప్రధానికి విషెస్‌  చెప్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు  పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు తదితరులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి... పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్‌ చేశారు. ఆయన దూరదృష్టి,  బలమైన నాయకత్వం...దేశ అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. అమృత్ కాల్‌లో ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని..  అద్భుతమైన నాయకత్వంతో దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో దేశానికి సేవ చేయడం తనకు చాలా గొప్ప  విషయమని ట్వీట్‌ చేశారాయన. ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాకు ప్రధాని బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజా నాయకుడిని  హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు జేపీ నడ్డా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా విషెస్‌ చెప్పారు. భారతదేశ గొప్ప భక్తుడికి పుట్టినరోజు  శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు యోగి. న్యూ ఇండియా వాస్తుశిల్పి, అభివృద్ధి చెందిన భారతదేశం కలలు కనే వన్ ఇండియా - బెస్ట్ ఇండియా సాధించే నాయకుడు,  ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నేత అంటూ మోదీని కొనియాడారు. 

పేద ప్రజల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న మోడిజీ భారతదేశాన్ని కొత్త అభివృద్ధి అభివృద్ధికి తీసుకెళ్లారని అన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌. మోదీ నాయకత్వంలో  భారతదేశం పురోగమిస్తూనే ఉంటుందన్నారు. మోదీకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, సుదీర్ఘ జీవితం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. ఇక, ప్రపంచ  వేదికపై దేశ గౌరవం, ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు, సమర్థవంతమైన, శక్తివంతమైన భారతదేశ వాస్తుశిల్పి, సనాతన సంస్కృతి జెండా మోసే ప్రధాని మోదీకి   పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి. 

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రతిపక్ష నేతలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కళాకారులు  కూడా తమదైన రీతిలో ప్రధాని మోదీ శుభాకాక్షంలు చేస్తున్నారు. స్మోక్‌ ఆర్టిస్ట్‌ దీపక్ బిస్వాల్... ప్రధాని మోదీ స్మోక్‌ చిత్రాన్ని సృష్టించారు. కోనార్క్ వీల్‌ను ప్రధాని మోదీ  బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగించారు. శాండ్‌ కళాకారుడు సుదర్షన్ కూడా ఒడిశాలోని పూరి బీచ్‌లో ప్రధాని మోదీ సైకత శిల్పం రూపొందించి.. ఆయనకు పుట్టిన రోజుల  శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Embed widget