Navy New Flag : భారత నేవీ కొత్త ఫ్లాగ్‌ను ఆవిష్కరించనున్న మోదీ - ఈ సారి జెండా అద్భుతమే !
ఇండియన్ నేవీ కొత్త ఫ్లాగ్‌ను ప్రధాని మోదీ సెప్టెంబర్ రెండోతేదీన ఆవిష్కరించనున్నారు. ఫ్లాగ్‌లో కీలక మార్పులు చేశారు.
Navy New Flag : ఇండియన్ నేవీకి కొత్త ఫ్లాగ్‌ను రూపొందించారు. సెప్టెంబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త జెండాను ఆవిష్కరించనున్నారు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమంలోనే కొత్త జెండాను కూడా ఆవిష్కరిస్తారు. కొత్త జెండా "సంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినది ఉంటుందని" కేంద్రం చెబుతోంది. ఇండియన్ నేవీ ఫ్లాగ్ మార్చడం ఇదే మొదటి సారి కాదు. 1950 నుండి మూడు సార్లు మార్చారు. ఇది నాలుగో సారి.
భారత జాతీయ జెండా చిహ్నంతో ఉండే నేవీ ఫ్లాగ్
ప్రస్తుతం భారత నావికాదళం చిహ్నంలో రెండు ఎరుపు చారల మధ్య భారతీయ చిహ్నం ఉంటుంది. ఎరుపు సమాంతర-నిలువు చారలతో తెల్లటి జెండాతో ఖండంలో త్రివర్ణ పతాకం ఉంటుంది. భారతదేశ విభజనతో, స్వాతంత్య్రం తర్వాత, రాయల్ ఇండియన్ నేవీ రాయల్ ఇండియన్ నేవీ, రాయల్ పాకిస్థాన్ నేవీగా విభజించారు. జనవరి 26, 1950న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించడంతో 'రాయల్' అనే పదాన్ని తొలగించారు. అప్పట్నుంచి ఇండియన్ నేవీగా వ్యవహరిస్తున్నారు.
Indian Navy Flag's journey... Will be finally freed from colonial clutches on Sept 2 as PM @narendramodi ji will unveil the new ensign without the Red Cross of St. George. Thank you Modi ji. Jai Hind 🇮🇳 pic.twitter.com/qFwAjzojcP
— Mayank Jindal (@MJ_007Club) August 31, 2022
ఇప్పటికి నాలుగు సార్లు మార్పు
2001 వరకు ఉన్న చిహ్నాన్ని మార్చి తర్వాత నేవీ బ్లూ కలర్ ఇండియన్ నేవీ క్రెస్ట్‌ని తీసుకువచ్చారు. 2004లో అశోక చిహ్నం తిరిగి చేర్చారు. 2001లో నావికాదళ చిహ్నం తొలగించారు. 2014లో అశోక్ చిహ్నం కింద జాతీయ నినాదం “సత్యమేవ జయతే” నే చేర్చారు. ఇప్పుడు మరోసారి మార్పులు చేశారు. భారత నావికాదళం: సెప్టెంబర్ 2న దేశీయంగా రూపొందించిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించనున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. భారత నావికాదళానికి సంబంధించిన కొత్త చిహ్నాన్ని ఆవిష్కరిస్తారని పీఎంవో ప్రకటించింది.
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించనున్న మోదీ
భారతదేశ నిపుణులతో దేశీయంగా తయారైన మొదటి యుద్ధ విమాన వాహన నౌక 'విక్రాంత్.' కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రతినిధులు ఇప్పటికే భారత నౌకాదళానికి అప్పగించారు. భారత నౌకాదళానికి చెందిన ఇన్‌హౌస్ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ దీని డిజైన్ రూపొందించింది. దీన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు.
#LegendisBack #IACVikrant - equipped with State-of-the-Art facilities is a 'City on the Move' @indiannavy @IN_WNC @INEasternNaval1 @IN_HQSNC pic.twitter.com/3IWKJPGiEJ
— IN (@IndiannavyMedia) August 30, 2022