By: Ram Manohar | Updated at : 29 Sep 2023 05:32 PM (IST)
మహిళా రిజర్వేషన్ బిల్‌కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
Women's Reservation Bill:
మహిళా రిజర్వేషన్ బిల్‌కి ఆమోదం..
ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండు సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్ (Women's Reservation Bill) పాస్ అయింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నారీ శక్తి వందన్ యాక్ట్ (Nari Shakti Vandan Act) పేరుతో ఈ బిల్‌ని ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టగా..రెండు సభల్లోనూ పాస్ అయింది. ఆ తరవాత ఆమోద ముద్ర వేసేందుకు రాష్ట్రపతికి పంపింది కేంద్రం. దీన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అప్రూవ్ చేశారు. కేంద్రం దీనిపై అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో 33% మేర మహిళలకే సీట్‌లు కేటాయిస్తారు. పార్లమెంట్‌లో ఈ బిల్ పాస్ అయినప్పుడే ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా మహిళలకు న్యాయం చేసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు.
Government of India issues a gazette notification for the Women's Reservation Bill after it received the assent of President Droupadi Murmu. pic.twitter.com/GvDI2lGF1C
— ANI (@ANI) September 29, 2023
సుదీర్ఘ చర్చలు..
మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆ మర్నాడు 20న చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు చర్చ తర్వాత మ్యాన్యువల్ ఓటింగ్ నిర్వహించారు. లోక్‌సభలో 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా (ఎంఐఎం ఎంపీలు) ఓటు వేశారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా 10 గంటల పాటు చర్చ జరిగింది. సెప్టెంబరు 21 రాత్రి 10 గంటల సమయంలో ఆటోమేటెడ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఈ చారిత్రక బిల్లును రాజ్యసభలో ఆమోదించారు. అయితే..ఇది ఇప్పట్లో అమలయ్యే అవకాశాలైతే లేవు. పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే కనీసం ఐదారేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.
రాజ్యాంగ సవరణలు..
మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని 239ఏఏ, 330, 332, 334 అధికరణలకు సవరణలు చేయనున్నారు. ఆర్టికల్ 239ఏఏ క్లాజ్ (2), సబ్‌క్లాజ్ (బి)కింద కొత్తగా బీఏ, బీబీ, బీసీ క్లాజులను చేర్చారు. ఆర్టికల్ 330 కింద కొత్తగా 330ఏ(1)(2)(3)ని చేర్చారు. ఆర్టికల్ 332 కింద 332ఏ (1)(2)(3)క్లాజ్లు చేర్చి ఢిల్లీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, వాటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించనున్నారు. ఆర్టికల్ 334లో కొత్తగా 334ఏ(1) చేర్చి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లన్నీ ఈ చట్టం అమల్లోకి వస్తాయి. జనగణన అనంతరం నిర్వహించే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే మహిళా బిల్లు అమల్లోకి రానుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న సీట్లన్నీ యథాతథంగా కొనసాగుతాయి.
Also Read: I.N.D.I.A కూటమికే మా ఫుల్ సపోర్ట్, సీట్ షేరింగ్‌పైనా త్వరలోనే క్లారిటీ - కేజ్రీవాల్
Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
MBBS: ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పరీక్షలు రాసేందుకు మరో అవకాశం
కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో 444 ఉద్యోగాల భర్తీ
Article 370: అసలేంటీ 'ఆర్టికల్ 370' - ఎందుకు రద్దు చేశారు.?, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏం జరిగిందంటే.?
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ నియామకం, ఉత్కంఠకు తెర
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>