New Rules on Adult Sites: పోర్న్ హబ్, ఎక్స్ వీడియోస్‌కు పెద్ద ఎదురు దెబ్బ! ఇక కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సిందే
ఈ అశ్లీల వెబ్‌సైట్‌లను మైనర్‌లు ఉపయోగించకుండా నిరోధించడానికి మరింత పటిష్ఠమైన చర్యలను అమలు చేయడానికి ఈ కొత్త నిబంధనలను విధించనున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పోర్నోగ్రఫీ వెబ్ సైట్లు అయిన పోర్న్ హబ్, ఎక్స్ వీడియోస్, స్ట్రిప్ చాట్ లు యూరప్‌లో గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఈ మూడు వెబ్ సైట్ల మీద ఐరోపా సమాఖ్య కఠినతరమైన నిబంధనలను విధించనుంది. యూరప్ దేశాల్లో ఈ మూడు వెబ్ సైట్లకు నెలవారీ యూజర్ బేస్ కనీసం 45 మినియన్లు గా ఉంది. అయితే, సదరు వెబ్ సైట్లు ఓపెన్ చేసిన సమయంలో యూజర్లు తప్పకుండా తమ ఏజ్ వెరిఫికేషన్ చేస్తేనే అందులోని కంటెంట్ యాక్సెస్ చేసే నిబంధనను యూరప్‌లో తీసుకురాబోతున్నారు. యురోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (డీఎస్ఏ) లోని వర్గీకరణల ప్రకారం.. ఈ పోర్న్ హబ్, ఎక్స్ వీడియోస్, స్ట్రిప్ చాట్ లు చాలా పెద్ద ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ గా పరిగణించారు.
ఈ అశ్లీల వెబ్‌సైట్‌లను మైనర్‌లు ఉపయోగించకుండా నిరోధించడానికి మరింత పటిష్ఠమైన చర్యలను అమలు చేయడానికి ఈ కొత్త నిబంధనలను విధించనున్నారు. డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ, పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు వంటి ఇల్లీగల్ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ ప్రయత్నాలను అమలు చేస్తున్నారు. యురోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా తమ పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఉందని నిరూపించుకోవడానికి ఈ వెబ్ సైట్లకు నాలుగు నెలల సమయం కూడా ఇచ్చారు. ఆ లోపు మొత్తం కంటెంట్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ లోని నిబంధనలకు లోబడి వారు మార్చుకోవాల్సి ఉంటుంది. పైగా వెబ్ సైట్ తెరిచినప్పుడు వయసు ధృవీకరణ మెకానిజమ్ అంతా.. డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ నిబంధనలకు లోబడి థర్డ్ పార్టీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది.
డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ కొత్త, కఠినమైన నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని నిర్ధారించుకోవడం చట్టపరంగా అత్యంత ఆవశ్యకం. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే, ఆయా సైట్ల ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 6 శాతం వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఇది ఈయూ కమిషన్ పరిధిలోకి వస్తుంది. అయితే, వెరీ లార్జ్ ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ కేటగిరీలో ఈ వెబ్ సైట్లు రెండో సెకండరీ గ్రూపు కిందికి వస్తాయి. గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌తో సహా మొత్తం 19 టెక్ దిగ్గజ సంస్థలకు తమ చట్టంలోని కొత్త నిబంధనలు వర్తిస్తాయని గత ఏప్రిల్‌లోనే ఈయూ కమిషన్ స్పష్టం చేసింది. మొదటి రౌండ్‌లో ఆ 19 కంపెనీలకు ఆగస్టులో డీఎస్ఏ చట్టం అమల్లోకి వచ్చింది.