హెలికాప్టర్‌ ప్రమాదంలో వీర మరణం పొందిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు ఇతర సైనికుల పార్థివదేహాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం అమర వీరుల కుటుంబాలను పరామర్శించారు. 


తమిళనాడు కూనూర్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక రావత్​ సహా 11 మంది సైనికుల పార్థివదేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్​బేస్​కు తీసుకువచ్చారు. అక్కడకు చేరుకున్న ప్రధాని మోడీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. 


ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే,  భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌ మార్షల్​ వీఆర్​ చౌదరి, నౌకాదళాధిపతి ​ ఆర్​ హరి కుమార్ నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ అమర జవాన్లకు నివాళులర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.


హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు దిల్లీలో శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు బిపిన్‌ రావత్‌ నివాసం వద్ద ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. దిల్లీ కంటోన్మెంట్‌లో బిపిన్‌ రావత్‌ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. 


Also Read: CDS Chopper Black Box: పేరుకే 'బ్లాక్ బాక్స్'.. కానీ కలర్, కథ వేరుంటది.. నిజం తేలాలంటే ఇదే కావాలి!


Also Read: Sudha Bharadwaj Bail: ఆ కేసులో మూడేళ్ల తర్వాత జైలు నుంచి సుధా భరద్వాజ్ విడుదల


Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు


Also Read: Rohini Court Blast: దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు


Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


Also Read:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు


Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి


Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి