సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాది కాలంగా చేస్తోన్న ఉద్యమానికి ఎట్టకేలకు ముగింపు పలికారు. ప్రభుత్వ హామీ అనంతరం నిరసనలకు ముగింపు పలికినట్లు సంయుక్త కిసాన్​ మోర్చా ప్రకటించింది. దిల్లీ- హరియాణా సింఘూ సరిహద్దు వద్ద నిరసన స్థలాల వద్ద ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను రైతులు తొలగిస్తున్నారు. డిసెంబర్ 11 లోపు నిరసన ప్రదేశాలను వదిలి వెళ్లనున్నట్లు కిసాన్ మోర్చా ప్రకటించింది.






కేంద్రం ఓకే..


ఉద్యమాన్ని నడిపిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతిపాదిత సవరణలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనలకు ఎస్‌కేఎం సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి కేంద్రానికి పంపింది. కిసాన్‌ మోర్చా పంపిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై ఎస్‌కేఎంలోనూ ఏకాభిప్రాయం కుదిరింది. 


రైతు ఉద్యమం సమయంలో దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఉద్యమం ముగించిన తరువాత ఉపసంహరించుకుంటామని కేంద్ర హోంశాఖ హామీ ఇచ్చింది. ముందు కేసులు ఉపసంహరించుకోవాలనీ, ఆ తర్వాతే ఉద్యమం ఆపుతామంటూ ఎస్‌కేఎం సవరణ కోరింది. వెంటనే కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రైతులు ఉద్యమాన్ని ముగించారు.


మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతలు దాదాపు ఏడాది పాటు చేసిన ఉద్యమానికి మోదీ సర్కార్ తలవంచింది. ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్ల స్వయంగా మోదీ ఇటీవల ప్రకటించారు. అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశంలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని పార్లమెంటు ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం పలికారు.


Also Read: Rohini Court Blast: దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు


Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


Also Read:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు


Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి


Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి