సముద్రపు ఆల్గే, సీ వీడ్.... అంటే సముద్రపు నాచు మొక్కలని అర్థం. వీటిలో ఉల్వా అనే మొక్కలు కూడా ఉన్నాయి. వీటి నుంచి తినదగిన భాగాలను వేరు చేస్తారు. దీన్నే ఉల్వాన్ అంటారు. ఈ ఉల్వాన్‌నే ‘సీ లెట్యూస్’ అని కూడా పిలుచుకుంటారు. దీన్ని సముద్రపు ఆకుకూరగా భావిస్తారు. సీ లెట్యూస్‌ను జపాన్, న్యూజిలాండ్, హవాయి ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తింటారు. ఉల్వా ఆల్గే చాలా ప్రభావవంతమైనది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని వ్యవసాయంలో తెగుళ్లకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. ఇది మానవ వైరస్లకు కూడా వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్మకం. అదే విధంగా కరోనా వైరస్‌పై కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని భావించారు శాస్త్రవేత్తలు. అందుకే దీనిపై అనేక ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 


ఉల్వా ఆల్గేను పెంచి,  దాన్నుంచి ఉల్వాన్ అనే సారాన్ని వేరు చేశారు. దాన్ని అమెరికాలోని అలబామాలో ఉన్న పరిశోధనా సంస్థకు పంపించారు. . మానవ కణాలపై పరిశోధన చేశారు. ఉల్వాన్ సమక్షంలో కరోనా వైరస్ మానవకణాలను సోకకపోవడం గమనించారు. అంటే కణాలను కరోనా వైరస్ బారిన పడకుండా ఉల్పాన్ నిరోధిస్తోందని తేలింది. ఇది వైద్య శాస్త్రంలో మంచి ముందడుగని భావించారు పరిశోధకులు. 


‘పేద దేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పటికీ అందలేదు. ఎప్పటికీ ప్రపంచంలోని కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందో చెప్పలేం. ఇలా అయితే కరోనా వైరస్ మరిన్ని వేరియంట్లను అభివృద్ధి చేసి రెచ్చిపోవడం ఖాయం. అందుకే ప్రత్యామ్నాయంగా చవకైన పరిష్కారం పేదప్రజల కోసం రావాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని ఉల్వాన్ భర్తీ చేస్తుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు ఈ ప్రయోగంలో ముఖ్యపాత్ర వహించిన ప్రొఫెసర్ అలెగ్జాండర్ గోల్బర్గ్. 


ఉల్వాన్‌ను కరోనా వైరస్‌ నిరోధానికి వాడేందుకు మరింత లోతైన పరిశీలన అవసరమని అభిప్రాయపడ్డారాయన. అధ్యయనం ఇంకా ప్రారంభదశలోనే ఉంది. దీనితో సమర్థవంతమైన ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మరికాస్త సమయం పడుతుందని తెలిపారు పరిశోధకులు. 


Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి