కరోనా వైరస్ రాగానే మాస్క్‌ల అమ్మకాలు పెరిగిపోయాయి. మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ ఎదుటివారికి చేరుతుందని, అందుకే మాస్క్ పెట్టుకోమని చెప్పారు వైద్యులు. అయితే లాలాజలంలోని వైరస్‌... మాట్లాడేటప్పుడు బయటికి పోకుండా, ఆ వైరస్ తీవ్రతను తగ్గించే చూయింగ్ గమ్‌ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ గమ్ లాలాజలంలోని వైరస్‌ను తటస్థీకరించి, వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని కనిపెట్టారు పరిశోధకులు. 


మొక్కల ప్రోటీన్‌తో... 
ఈ చూయింగ్ గమ్ ఒక మొక్క ప్రోటీన్‌తో తయారుచేశారు. ఇది నోట్లోని వైరస్‌ను బయటికి తుళ్లిపోకుండా, ఉచ్చు వలే తనలో చిక్కుకునేలా చేస్తుంది. దీని వల్ల లాలాజలంలో వైరస్ శాతం తగ్గుతుంది. వైరస్ అంతా చూయింగ్ గమ్‌కే అతుక్కుంటుంది, గమ్ లో ఉన్న ACE2 ప్రోటీన్‌ దాన్ని  బంధింస్తుంది.  కాబట్టి వ్యాప్తి కూడా తగ్గుతుందని ‘మాలిక్యులర్ థెరపీ జర్నల్’ లో ఒక కథనం ప్రచురితమైంది. నిజానికి ACE2 ప్రోటీన్ ను అధికరక్తపోటు చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం మొక్కల్లో ఈ ACE2 ప్రోటీన్ ను పెంచడం ప్రారంభించారు. ఆ ప్రోటీన్తో ఒక చూయింగ్ గమ్ తయారుచేశారు. ఆ చూయింగ్ గమ్‌కు దాల్చినచెక్క ఫ్లేవర్‌ను చేర్చారు. ఈ గమ్‌‌ను కోవిడ్ పాజిటివ్ రోగుల నుంచి సేకరించిన స్వాబ్‌‌తో కలిపి పరీక్షించారు. ఆ పరీక్షలో ఈ ప్రోటీన్ కరోనా వైరస్ ను పట్టి ఉంచగలదని కనుగొన్నారు. ఈ గమ్... వైరస్ కణాలు మానవ శరీరంలోకి వెళ్లకుండా  అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.  తద్వారా వ్యాప్తి కూడా తగ్గుముఖం పడుతుంది. 


పరిశోధనా బృందం SARS-CoV-2 సోకిన వ్యక్తులపై ఈ చూయింగ్ గమ్‌ను పరిక్షించి సురక్షితంగా, ప్రభావవంతంగా ఉందో లేదో అంచనా వేయాలని భావిస్తున్నారు. ఇందుకు  క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి అనుమతిని పొందేందుకు ప్రయత్నిస్తోంది.  


రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు కూడా, వేయించుకోనివాళ్లతో సమానంగా వైరస్ ను మోసుకుంటూ తిరుగుతున్నారని, వ్యాప్తి చెందేలా చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు ధీమాగా ఉండేందుకు వీలు లేదని, వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 


Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే


Read Also: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి


Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి