మేషం
వ్యాపారం బాగా సాగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.  సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. టెన్షన్ తగ్గుతుంది. 
వృషభం
ఈరోజు  ఎవరితోనైనా విభేదాలు తలెత్తవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.  ఖర్చులు పెరుగుతాయి.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. కొందరు బాధ్యతలు నిర్వర్తించలేక తప్పుకుంటారు. అధిక ఒత్తిడి తీసుకోకుండా ఉండండి.
మిధునం
కార్యాలయంలో అధికారులకు ప్రశంసలు అందుకుంటారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులను కలుస్తారు. మీరు మంచి సమాచారాన్ని పొందొచ్చు. మీ ఖర్చులను నియంత్రించేందుకు  ప్రయత్నించండి. ఆరోగ్యం క్షీణిస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. 
Also Read:  ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..
కర్కాటకం
శుభవార్త వింటారు. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ దాదాపు పూర్తవుతాయి.  కోపం తగ్గించుకోండి. అధిక శ్రమ కారణంగా మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. మిత్రులను కలుస్తారు. దంపతుల మధ్య మధురానుభూతి ఉంటుంది.
సింహం
ఈరోజు మీరోజు.  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆఫీసులో కొంత ఇబ్బంది ఉండొచ్చు. బంధువుల నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి.
కన్య
వ్యాపారం బాగుంటుంది. మీ దినచర్యను మార్చుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. అధికంగా కష్టపడొద్దు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
తుల
ఈరోజు సాధారణంగా ఉంటుంది.  ఆచరణలో మొరటుతనం ఉంటుంది. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. టెన్షన్‌ పడతారు.  కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఉద్యోగుల బాధ్యత పెరుగుతుంది.  విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. 
వృశ్చికం
డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కారణం లేకుండా ఖర్చు చేయవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. దూరప్రాంత ప్రయాణాలు వాయిదా వేయండి. సమాజంలో గౌరవం  అందుకుంటారు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనుస్సు 
ఈ రోజు సానుకూలంగా ఉంటారు.మీ సహకారంతో చాలామంది పనులు పూర్తవుతాయి.  ఈరోజు మీకు శుభవార్త వింటారు.  కుటుంబంతో సమయం గడిచిపోతుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
మకరం
వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.  రుణం మొత్తం తిరిగి పొందుతారు. మీ మాటపై సంయమనం పాటించండి. అధిక పని కారణంగా  అలసిపోతారు. చిరాకుగా ఉంటారు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం
చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. బంధువులను కలుస్తారు..శుభవార్త వినే అవకాశం ఉంది.  విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృద్ధులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరిచితుల నుంచి దూరంగా ఉండండి.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీనం
గొప్ప బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. సంతానం సమస్య తొలగిపోతుంది. కెరీర్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. ఈరోజంతా సానుకూలంగా ఉంటారు. పిల్లలతో సమయం గడపగలుగుతారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి