ఆహారం అరగకపోయినా, వేడి చేసినా కడుపునొప్పి వస్తుంది.  కడుపునొప్పి రావడం, తగ్గడం అనేది చాలా సాధారణ సమస్య అయిపోయింది. కానీ దాన్ని అంత తేలికగా తీసుకోకూడదని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే కొన్ని భయంకరమైన వ్యాధులకు కడుపునొప్పి కూడా ఒక లక్షణమే. ముఖ్యంగా కాలేయ సమస్యలకు. అందుకే తరచూ కడుపునొప్పి వచ్చి తగ్గుతుంటే, ఎందుకు వస్తుందో తప్పకుండా తెలుసుకోవాలి. 


లివర్ పెరగడం అనేది ఒక ప్రమాదకరమై వ్యాధి. దీన్ని లివర్ సిర్రోసిస్, ఫ్యాలీ లివర్ అనే సమస్యలు వచ్చినప్పుడు కాలేయం పరిమాణం పెరగుతుంది. అంటే ఉబ్బుతుందన్న మాట. ఇలా జరిగినప్పుడు కూడా తరచూ కడుపు నొప్పి వేధిస్తుంది. ఓ పెయిన్ కిల్లర్ వేసుకుని ఆ నొప్పిని చంపేస్తారు చాలా మంది. ఈ లివర్ సమస్య ఎక్కువగా మద్యం తాగే వారిలో కనిపిస్తుంది. అలాగే ఊబకాయం, హెపటైటిస్ ఇన్ ఫెక్షన్ వచ్చిన వారిలోనూ లివర్ సమస్య మొదలవుతుంది. కాబట్టి కడుపునొప్పి వారంలో ఎక్కువ సార్లు వేధిస్తున్నప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు వస్తుందో కారణం తెలుసుకోవాలి. 


తేలికగా తీసుకోవద్దు
కడుపునొప్పికి, కాలేయ సమస్యకు దగ్గరి సంబంధం ఉంది కాబట్టి వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం. ఏ భాగం సక్రమంగా పనిచేయకపోయినా, ఆరోగ్యంగా లేకపోయినా.. మన శరీరం కొన్ని సంకేతాల ద్వారా ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే లివర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి


Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే


Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి