దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలికి గాయమైనట్లు పోలీసులు వెల్లడించారు. దిల్లీ రోహిణి కోర్టు నంబర్ 102లో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. 7 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
ఘటనాస్థలిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. ఘటనపై దిల్లీ ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ల్యాప్‌టాప్ పేలిందని భావించినప్పటికీ అసలు కారణం టిఫిన్ బాంబు అని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
కాల్పులు..
దిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఓ గ్యాంగ్‌స్టర్ సహా.. మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్యాంగ్‌స్టర్ జితేంద్ర అలియాస్ గోగీని రోహిణీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారు దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ క్రమంలోనే.. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు గోగీపై కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు హతమయ్యారు.
ఇందులో ఒకరిపై రూ. 50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా. తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు. జితేంద్ర గోగీని వివిధ కేసుల కింద 2020లో దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు
Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Also Read: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి
Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి