సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. మూడు రోజుల పాటు కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 11 డిమాండ్లను యాజమాన్యం ముందు సింగరేణి కార్మికులు ఉంచారు. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో నాలుగు బ్లాక్‌లు సింగరేణి పరిధిలో ఉన్నాయి. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలూ మద్దతు తెలిపాయి.
కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకున్న నాలుగు బొగ్గు బ్లాకుల అన్వేషణ కోసం సింగరేణి రూ. 750 కోట్లు ఖర్చు చేసింది. నూతనంగా గుర్తించిన బొగ్గు బ్లాకులను తన పరిధిలోకి తీసుకువచ్చేలా కేంద్రం ఇటీవలే చట్టం చేసింది. ఫలితంగా సింగరేణి సంస్థకు నూతన గనుల అనుమతి లభించలేదు. ఈ క్రమంలోనే సింగరేణి యాజమాన్యం గుర్తించిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు నిర్ణయించింది. ఈనెల 13న బొగ్గు బ్లాకులకు సంబంధించిన బిడ్డింగ్ ఉంది.
Also Read : మెకానిక్ షెడ్డులో మూడు హత్యలు.. ఎవరి పని.. పోలీసులకు సవాల్‌గా మారిన మర్డర్స్
తక్షణం ఆ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. అందుకే బిడ్డింగ్ కంటే ముందే సమ్మె చేసి కేంద్రానికి తమ నిరసన తెలపాలని నిర్ణయించారు. కార్మిక సంఘాలన్నీ ఇటీవల ఏకతాటిపైకా రాలేదు. కానీ ఈ సమ్మె విషయంలో అన్ని సంఘాలూ ఒకే మాట మీద ఉన్నాయి. 72 గంటల పాటు సింగరేణిలో ఉన్న 44 గనులు 19 ఓసీపీలు, 25 భూగర్భ కేంద్రాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. రోజుకు 2 లక్షల టన్నుల చొప్పున మూడు రోజుల్లో 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగనుంది.
Also Read : బొగ్గు గనుల వేలం ఆపండి.. ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్
తొలి రోజు అన్ని గనుల వద్ద నిరసన తెలిపిన కార్మిక సంఘాలు విధులు బహిష్కరించాయి. సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్బంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు వచ్చిన ఉద్యోగులను అడ్డుకున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్ని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి