ఒకప్పుడు రూ. రెండు వేల నోటుకు చిల్లర దొరికేది కాదు. ఎందుకంటే నోట్ల రద్దు సమయంలో అందరి దగ్గరా  రూ. రెండు వేల నోట్లే ఉండేవి. కానీ ఇప్పుడు రూ. రెండు వేల నోట్లే కనిపించడం లేదు. బ్యాంకుల్లో కూడా అలాంటి నోట్లు ఇవ్వడం మానేశారు. ఎవరి దగ్గరైనా ఉంటే డిపాజిట్ చేయడమే కానీ..బ్యాంకులు మాత్రం అతిపెద్ద నోటుగా రూ. ఐదు వందలను మాత్రమే చూస్తున్నాయి. దీంతో  రూ. రెండు వేల కోట్లు కంటికి కనిపించడం అరుదయిపోయింది. అంతే కాదు.. కొద్ది రోజులకు అసలు రూ. రెండు వేల నోట్లు చెలామణిలో ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే రూ. రెండు వేల నోట్ల ముద్రణను కేంద్రం ఎప్పుడో నిలిపేసింది. 


Also Read : కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి


దేశంలో రూ.2,000 నోట్ల చలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. 2018-19 తర్వాత కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసినట్లు రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 2018 మార్చి నాటికి మొత్తం చలామణీలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్లు 3.27 శాతం వాటా కలిగి ఉన్నాయి. కానీ 2021 నవంబర్‌ ముగింపు నాటికి 1.75 శాతానికి తగ్గాయి. 2018 మార్చి రూ. 336.3 కోట్ల రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని.. ఇప్పుడవి రూ. 223.3 కోట్లకు పరిమితమయ్యాయి. 


Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సంప్రదించిన తర్వాత నగదు లావాదేవీలపై ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకు నోట్లను ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకే రూ. రెండు వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని కేంద్రం చెబుతోంది. ఆర్థిక వద్ధిరేటు, వడ్డీరేట్ల స్థాయితో పాటు పలు సూక్ష్మ ఆర్థిక అంశాలపై కరెన్సీకి డిమాండ్‌ ఉంటుందని కేంద్రం చెబుతోంది.  2016 నవంబర్‌లో ప్రధాని మోడీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి రూ.2,000 నోటును తీసుకొచ్చారు. అప్పట్లో అందరికీ నగదు అందించేందుకు రూ. రెండు వేల నోటును తెచ్చారు. 


Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్‌, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయంటే!


రూ. రెండు వేల నోటును కేంద్రం రద్దు చేస్తుందని తరచూ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అయితే కేంద్రం అలాంటి రద్దు నిర్ణయం తీసుకోవడం కన్నా..వ్యూహాత్మకంగా ఉపసంహరించుకోవడం మంచిదన్న నిర్ణయాన్ని వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే బ్యాంకులకు వచ్చే రూ. రెండు వేల నోట్లను మళ్లీ మార్కెట్‌లోకి వెల్లకుండా ఆపుతున్నట్లుగా భావిస్తున్నారు. 



Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి