ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా..? జీవిత బీమా ప్రీమియం చెల్లించలేక అవస్థలు పడుతున్నారా? ఉద్యోగ భవిష్య నిధి (EPFO)ని మీ ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించమని కోరండి. బీమా కొనుగోలు చేసే ముందైనా లేదా ప్రీమియం చెల్లించే ముందైనా ఈ అవకాశాన్ని  ఉపయోగించుకోవచ్చు.


ఫామ్‌ 14ను ఉపయోగించడం ద్వారా మీరు ఈపీఎఫ్‌వో ఖాతా ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో ఈ పత్రాన్ని సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ దరఖాస్తు సమర్పించిన వెంటనే ప్రాసెస్‌ మొదలు పెడతారు. ఆ తర్వాత ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించే తేదీ సమీపించగానే నేరుగా మీ ఖాతాలో నగదును డిడక్ట్‌ చేస్తారు. ఫామ్‌ 14 ఉపయోగించుకోవాలంటే మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో రెండేళ్లకు సరిపడా ప్రీమియం డబ్బులు ఉండాలి.


ఫామ్‌-14లో సమర్పించాల్సిన వివరాలు



  • మీ ఎల్‌ఐసీ శాఖ కార్యాలయం చిరునామా

  • బీమా లేదా ప్రతిపాదన సంఖ్య, తేదీ

  • తీసుకున్న / తీసుకుంటున్న బీమా మొత్తం

  • బీమా కొనుగోలు చేసే తేదీ

  • ఒక వేళ మీ ప్రతిపాదన అంగీకరిస్తే మొదటి ప్రీమియం ఎప్పుడు చెల్లించాలి

  • ఏడాది ప్రీమియం వివరాలు

  • ప్రీమియం చెల్లించాల్సిన తేదీ

  • చివరి ప్రీమియం చెల్లించిన తీదీ

  • మీ వయసు అప్‌డేట్‌ చేశారా? లేదంటే ఎలాంటి ప్రూఫ్‌ ఇచ్చారో చెప్పాలి

  • మీ బీమా నామినీ ఎవరు

  • ఒకవేళ సంరక్షకుడిని నియమిస్తే.. వివరాలు

  • గతంలో బీమా కట్టేందుకు ఈపీఎఫ్‌వో నుంచి డబ్బులు ఉపసంహరించలేదన్న ధ్రువీకరణ


Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..


Also Read: Petrol-Diesel Price, 6 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో హెచ్చుతగ్గులు.. తాజా ధరలు ఇలా..


Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!


Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?