ప్రస్తుతం మనదేశంలో ఆధార్ కార్డు అన్నిటి కంటే అవసరమైన డాక్యుమెంట్ అయింది. ప్రభుత్వ సర్వీసులు కావాలంటే ఆధార్ కంపల్సరీ. దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇందులో 12 అంకెలు ఉంటాయి. ఆధార్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే డూప్లికేట్ కార్డును కూడా వెంటనే పొందవచ్చు. ఆధార్ కార్డు రీప్రింట్ అనేది చాలా సులువైన ప్రక్రియ.
డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా?
స్టెప్ 1: యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ‘uidai.gov.in’కు వెళ్లాలి.
స్టెప్ 2: అక్కడ మీరు ఆధార్ నంబర్(యూఐడీ) లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్(ఈఐడీ)ను ఎంచుకోవచ్చు.
స్టెప్ 3: మీ పూర్తి పేరు, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 4: మీకు స్క్రీన్ మీద కనిపించే 4 అంకెల సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 5: ఓటీపీ బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
స్టెప్ 6: మీకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
స్టెప్ 7: వెరిఫై ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ మీకు మెసేజ్‌గా వస్తుంది.
స్టెప్ 8: ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఎంచుకున్నా, యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్‌ను పీడీఎఫ్ ఫైల్‌గా ఎంచుకోండి.
స్టెప్ 9: మీ వివరాలు ఎంటర్ చేయండి.
స్టెప్ 10: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
స్టెప్ 11: మీ ఓటీపీని ఎంటర్ చేసి ‘వాలిడేట్ అండ్ జనరేట్’పై క్లిక్ చేయండి.
స్టెప్ 12: అక్కడ దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోండి.
రీప్రింట్ చేసిన ఆధార్ కార్డు పొందడం ఎలా?
స్టెప్ 1: యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ‘uidai.gov.in’కు వెళ్లాలి.
స్టెప్ 2: గెట్ ఆధార్ సెక్షన్‌లో “Order Aadhaar Reprint”ను ఎంచుకోండి.
స్టెప్ 3: మీ ఆధార్ నంబర్(యూఐడీ) లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్(ఈఐడీ)ను ఎంచుకోవాలి.
స్టెప్ 4: సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 5: సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి
స్టెప్ 7: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్‌బాక్స్‌పై టిక్ చేసి, తర్వాతి పేజీలో సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 8: అక్కడ మీకు కావాల్సిన పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని, అవసరమైన నగదు చెల్లించాలి.
స్టెప్ 9: అకనాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
స్టెప్ 10: పేమెంట్ పూర్తయ్యాక, మీ ఆధార్ కార్డు ప్రింట్ అయి మీకు వచ్చేస్తుంది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!