RBI Monetary Policy: మార్కెట్ విశ్లేషకులు ఊహించిందే జరిగింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది. రెండు నెలలకు నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం నాడు నిర్వహించారు. ఇందులో భాగంగా కీలక వడ్డీ రేట్లలో ఏ మార్పులు చేయలేదు.
రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉండగా.. రెపో రేటు 4 శాతంగా కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మరోవైపు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. రెండు నెలల కిందట జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోగా.. తాజాగానూ రివర్స్ రెపో రేటు, రెపో రేటను మార్చడం లేదని స్పష్టం చేశారు.
కరోనా సంక్షోభం, తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకోనుందని విశ్లేషకులు అంచాన వేయగా అదే నిజమైంది. మరోవైపు గత కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు మెరుగయ్యాయి. వాస్తవ జీడీపీ రేటు 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ 9.5 శాతంగా ఉండాలని అంచనా వేశారు. యూపీఐ ఆధారిత సేవలు కొనసాగించడానికి కొత్త ఉత్పత్తులు తీసుకురావాలని భావిస్తోంది.
Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!
ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ద్రవ్యోల్బణాన్ని 5.3 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 5.1 శాతంగా, నాలుగో త్రైమాసికానికిగానూ 5.7 శాతం, తొలి త్రైమాసికంలో 5 శాతంగా అంచనా వేశారు. బ్యాంకులు తమ శాఖలు మరియు విదేశాల్లోని బ్రాంచ్‌లలో మూలధనాన్ని కొనసాగించేందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. విదేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకే చాలా మేరకు మెరుగైందని ఆర్బీఐ పేర్కొంది.
ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు ఇంధన ధరలు తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం వస్తుందని అభిప్రాయపడ్డారు. ముడి చమురు ధరలు దిగిరావడంతో కొన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరలు తగ్గడంతో వాహనదారులకు ఊరట కలిగింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5.3శాతంగా అంచనా వేసింది.
Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!