Toy Library: ప్రైవేట్ ఉద్యోగాలు, టార్గెట్‌లు, లేఆఫ్‌లతో విసిగిపోయిన చాలా మంది వ్యాపారం ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నారు. పెట్టుబడి తక్కువగా ఉండటమే కాకుండా రిస్క్ మరింత తక్కువగా ఉండే బిజినెస్ ప్లాన్స్ చేయాలని మీ మైండ్‌లో ఉంటే టాయ్ లైబ్రరీ చాలా మంచి ఎంపిక అవుతుంది.
టాయ్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. ఏడాది పిల్లాడి నుంచి పదిహేను ఏళ్ల పిల్లల వరకు అందరూ గేమ్స్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి వారి ఇష్టాన్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లల్లో టాయ్స్ ఉంటాయి. కానీ ఒక ఏజ్ తర్వాత అవి పనికిరాకుండా పోతాయి. లేకపోతే అవుడ్డేట్ అయిపోతాయి. కొందరికి బొమ్మలు కొనే స్థోమత లేకపోవచ్చు. అలాంటి వారందర్నీ ఆకట్టుకునే టాయ్స్ ఏర్పాటు చేయగలిగితే మంచి బిజినెస్ అవుతుంది.
టాయ్ లైబ్రరీ అంటే ఏంటీ?పుస్తకాల లైబ్రరీ మాదిరిగానే ఓ మంచి విశాలమైన బిల్డింగ్‌లో చిన్న చిన్న చాంబర్స్ మాదిరిగా ఏర్పాటు చేసి బొమ్మలతో లైబ్రరీ ఏర్పాటు చేయవచ్చు. అక్కడే చిన్నారులు ఆడుకునే సదుపాయం కల్పించవచ్చు. లేదంటే వాళ్లు తమతో బొమ్మలు తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఇవ్వొచ్చు.
టాయ్ లైబ్రరీ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు ఏంటీ?వేసవి కాలం సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని స్కూల్స్ సెలవులు ఇచ్చేశాయి. ఈ సెలవుల్లో చిన్నారులు పుస్తకాలు తీసి చదివేది చాలా అరుదు. ఇదే టైంలో బయటకు పంపించాలంటే చాలా మంది తల్లిదండ్రులకు భయం. ఇంట్లోనే కంటిన్యూగా ఉంటే టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్‌కు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వారి దృష్టి మరల్చేందుకు టాయ్ లైబ్రరీ మంచి ప్లేయింగ్ జోన్ అవుతుంది.
తల్లిదండ్రులకు అన్ని రకాల బొమ్మలు కొనాలంటే ఇబ్బంది. అందుకే వారి ఖర్చులు కూడా ఈ టాయ్ లైబ్రరీతో తగ్గుతుంది. ఇదే మీకు ప్రచారం కల్పిస్తుంది.
మీరు టాయ్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్లు అవుతారు. ఆందరూ అన్ని బొమ్మలు కొనడం వల్ల అవి పాడైపోయిన తర్వాత చెత్త పేరుకుపోతోంది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది.
టాయ్ లైబ్రరీకి ఏం కావాలి ?టాయ్ లైబ్రరీ ఏర్పాటుకు మీకు విశాలమైన స్థలం కావాలి. చిన్న ప్లేస్‌లో కూడా ఏర్పాటు చేయవచ్చు. అది పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉండాలి. వాళ్లతో వచ్చే తల్లిదండ్రులు వెయిట్ చేసేందుకు ప్లేస్ ఉండాలి. వివిధ వయసులు వాళ్లు ఆడుకునే బొమ్మలు కొనుగోలు చేయాలి. ఏడాది వయసు నుంచి 15 ఏళ్ల వయసులు వాళ్లు ఆడుకునే వీలుగా అవి ఉండాలి.
బొమ్మలు భద్రపరిచేందుకు తగిన ఫర్నీచర్ ఉండాలి. నీటి సౌకర్యం ఉండాలి. బొమ్మలు తీసుకున్న వారి పేర్లు, ఇతర వివరాలు నమోదు చేయడానికి సిస్టమ్ ఉండాలి. హాల్‌లో పెద్ద గడియారం ఉండాలి. ఈ బొమ్మలు నిర్వహించడానికి సిబ్బంది అవసరం అవుతుంది. మీ ఇంట్లో వాళ్లతో కూడా ఈ పని చేస్తే మీకు ఖర్చులు మిగులుతాయి.
టాయ్ లైబ్రరీ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందిమీరు ఏ స్థాయిలో టాయ్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారో దాని బట్టి ఖర్చు మారుతుంది. మీరు తక్కువలో తక్కువ అనుకుంటే 2 లక్షల రూపాయలతో కూడా టాయ్ లైబ్రరీ ఏర్పాటు చేయవచ్చు. దీనికి అధికారుల నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. వ్యాపారలైసెన్స్ కావాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాటార్, విద్యుత్, ఫెసిలిటీ కోసం అభ్యర్థన పెట్టుకోవాలి.
టాయ్ లైబ్రరీ ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటాయ్ లైబ్రరీ ఏర్పాటులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి వారి ఏజ్‌లను బట్టి కొన్ని బొమ్మలు పిల్లలకు అందుబాటులో ఉండకుండా చూసుకోవాలి. బొమ్మలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. పరిసర ప్రాంతాలను నిరంతరం క్లీన్ చేయాలి.