ABP  WhatsApp

International Commercial Flights: అంతర్జాతీయ విమాన సేవలపై కీలక ప్రకటన.. ఒమిక్రాన్ వ్యాప్తి వల్లే నిర్ణయం

ABP Desam Updated at: 09 Dec 2021 07:49 PM (IST)
Edited By: Murali Krishna

అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం పొడిగింపు

NEXT PREV

ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిషేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను 2022 జనవరి 31 వరకు పొడిగించింది.


డిసెంబర్​ 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని ఇటీవల పౌర విమానయాన శాఖ తెలిపింది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతోన్న కారణంగా నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఈ మేరకు ప్రకటించింది.



2021, నవంబర్ 26న ఇచ్చిన ప్రకటనను సవరిస్తున్నాం. అంతర్జాతీయ విమాన సేవలపై ఉన్న నిషేధాన్ని 2022 జనవరి 31 వరకు పొడిగిస్తున్నాం. అయితే అంతర్జాతీయ కార్గో సేవలకు, డీజీసీఏ అనుమతించిన ప్రత్యేక విమానాలకు ఈ నిషేధం వర్తించదు.                                                 - డీజీసీఏ అధికారిక ప్రకటన


ఒమిక్రాన్ కేసులు..


భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్  కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.


Also Read: CDS Bipin Rawat Cremation: బిపిన్ రావత్ అంత్యక్రియలు జరిగేది ఇక్కడే.. పార్థివ దేహాలకు మోదీ నివాళి


Also Read: CDS Chopper Black Box: పేరుకే 'బ్లాక్ బాక్స్'.. కానీ కలర్, కథ వేరుంటది.. నిజం తేలాలంటే ఇదే కావాలి!


Also Read: Sudha Bharadwaj Bail: ఆ కేసులో మూడేళ్ల తర్వాత జైలు నుంచి సుధా భరద్వాజ్ విడుదల


Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు


Also Read: Rohini Court Blast: దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు


Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


Also Read:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు


Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి


Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 09 Dec 2021 07:46 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.