న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌.. భీమా కోరెగావ్ కేసులో మూడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఇన్నాళ్లు ఉన్నారు.


కేసు ఇదే..


2017, డిసెంబర్​ 31న పుణె షానివార్​వాడాలోని ఎల్గర్​ పరిషద్​ కాన్​క్లేవ్​ వద్ద చేసిన రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఆ తర్వాతి రోజు భీమా కోరాగావ్​ వార్​ మెమోరియల్​ వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో భాగంగా సుధా భరద్వాజ్​తో పాటు పలువురు హక్కుల నేతలపై కేసు నమోదు చేశారు.


ఈ కేసులో విచారణ చేపట్టిన పుణె పోలుసు వీరి వెనక మావోయిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)కు అప్పగించారు. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2018, ఆగస్టులో భరద్వాజ్​ను అరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ. తమకు తెలియకుండా ముంబయిని వదిలి వెళ్లొద్దని, పాస్​పోర్ట్​ అప్పగించాలని, ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.


బాంబే హైకోర్టు బెయిల్..


ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న భరద్వాజ్​కు​ 2021, డిసెంబర్​ 1న బాంబే హైకోర్టు డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసింది.


డిసెంబర్​ 8న బెయిల్​ ఆంక్షలు, విడుదల తేదీని నిర్ణయించాలని ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టును ఆదేశించింది.


హైకోర్టు ఆదేశాల మేరకు విచారించిన ఎన్​ఐఏ కోర్టు రూ.50వేల పూచీకత్తుతో విడుదల చేసేందుకు ఆదేశించింది.


కోర్టు ఆదేశాలు అందిన తర్వాత అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి సుధా భరద్వాజ్ బయటకు వచ్చారు​.


మిగిలినవారు..


భీమా-కొరేగావ్ కేసులో అరెస్టైన 16 మంది నిందితుల్లో డీఫాల్ట్​ బెయిల్ పొందిన వారిలో సుధా భరద్వాజ్​ తొలి వ్యక్తి. మరో ఎనిమిది మంది బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. కవి, సామాజిక కార్యకర్త వరవరరావు ప్రస్తుతం మెడికల్​ బెయిల్​లో ఉన్నారు. మరో నిందితుడు హక్కుల నేత స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 5న మరణించారు. మిగతా వాళ్లంతా ప్రస్తుతం విచారణ ఖైదీలుగా కస్టడీలో ఉన్నారు.


Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు


Also Read: Rohini Court Blast: దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు


Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


Also Read:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు


Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి


Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి