PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ.. థామస్ కప్ గెలిచిన బ్యాడ్మింటన్ టీమ్‌తో సరదాగా మాట్లాడారు.
![PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు PM Modi Interacts With Thomas Cup Champions says 'Yes, We Can Do It Attitude Is Our New Strength' PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/21/7fbd9c62a0ef6b86762da658d878cc36_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi: థామస్ కప్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈ కప్ గెలిచి చరిత్ర సృష్టించడంపై స్వయంగా కలిసి అభినందించారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.
Interacted with our badminton champions, who shared their experiences from the Thomas Cup and Uber Cup. The players talked about different aspects of their game, life beyond badminton and more. India is proud of their accomplishments. https://t.co/sz1FrRTub8
— Narendra Modi (@narendramodi) May 22, 2022
ప్రత్యేకంగా
కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ప్రధాని ఆటగాళ్లందరితో గంటకుపైగా సరదాగా మాట్లాడారు. జట్టుకు నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
PM Sh @narendramodi ji interacted with India’s badminton champions, who shared their journey and experiences from playing the sport.
— Anurag Thakur (@ianuragthakur) May 22, 2022
The athletes shared candid moments and thanked the PM for his enthusiastic support at every stage. Here’s wishing them the very best ahead ! pic.twitter.com/YywI26EwNY
తొలిసారి
73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి భారత్ కప్ అందుకుంది. సింగిల్స్, డబుల్స్‌లో అద్భుతంగా రాణించిన భారత్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండోనేసియాపై 3-0తో గ్రాండ్ విక్టరీ సాధించింది. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది.
Also Read: UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Also Read: Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)