By: ABP Desam | Updated at : 19 Mar 2022 07:00 PM (IST)
పెళ్లి కాని ఎమ్మెల్యేకు మనవడట !
" గ్రాండ్ సన్ ఆఫ్ నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే ఎం.ఆర్ గాంధీ " ఇదేదో హోదా అయినట్లుగా ఓ వ్యక్తి తన బైక్‌పై రాసుకుని తిరుగుతున్నాడు. ఎక్కడో రాసుకుంటే సర్లే అదో రకం అనుకునేవారు కానీ అతను నెంబర్ ప్లేట్‌పై నెంబర్లు తీసేసి.. ఇదే హోదాను రాసుకున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చాలా మంది దేశానికి పెద్ద దరిద్రం ఇదేనని తిట్టుకున్నారు. అయితే నాగ్‌కోయిల్ ఎమ్మెల్యే గురించి తెలిసిన వారు మాత్రం ఓ హిలేరియస్ నిజాన్ని బయట పెట్టారు. అదేమిటంటే.. నాగర్ కోయిల్ ఎమ్మెల్యే గాంధీ అసలు పెళ్లి చేసుకోలేదు.
This guy is ‘grandson of Nagercoil BJP MLA!!!!’😳🤨🤔🤭 pic.twitter.com/XtoM3th2fm
— ᴀʀᴜɴ ᴘᴀʟᴀᴄᴋᴀʟᴏᴅʏ (@ArunPalackalody) March 14, 2022
తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గాంధీ పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన బ్రహ్మచారి అసలు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయనకు పిల్లలు.. మనవళ్లు ఉండే అవకాశం లేదు. దీంతో మరి లేని హోదాను నెంబర్ ప్లేట్‌మీద పెట్టుకుని మరీ తిరుగుతున్న ఆ యువకుడు ఎవరు అని సోషల్ మీడియానే ఆరా తీసింది. చివరికి అతని పేరు అమ్రిష్ అని తేలింది. అతను కూడా నాగర్‌కోయిల్‌కు చెందినవాడే. ఎమ్మెల్యే గాంధీకి అనుచరునిగా చెప్పుకునే కన్నన్ అనే వ్యక్తి కుమారుడుగా తేలింది.
Grandson of TN MLA do not need number plate and can violate traffic rules pic.twitter.com/aEnRrHTeTh
— SAI@SAA (@sainairv) March 14, 2022
గాంధీకి అనుచరుడుగా ఉన్న వ్యక్తి కుమారుడు.. తన తన తాత గాంధీ అని చెప్పుకుని మరీ తిరుగుతూండటం నెటిజన్లకు మరింత సెటైరిక్‌గా విమర్శించడానికి అవకాశం చిక్కింది. గతంలో ఎన్డీ తివారీ అంశంలో జరిగిన ఉదంతాన్ని ఎత్తి చూపుతూ.. నెటిజన్లు విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడీ వ్యక్తి తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యారు.
ఎమ్మెల్యేలు.. ఎంపీ కుమారులు.. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా నెంబర్ ప్లేట్లను కూడా మార్చేసి ఇలా హోదాలు.. కొటేషన్లు రాసుకుని రోడ్డెక్కడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు వీరు ప్రమాదాలు చేసి.. నెంబర్ ప్లేట్ కూడా లేకుండా ఉండటం వల్ల తప్పించుకు తిరుగుతూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉన్నా అదే పరిస్థితి. సామాన్యులు ఎవరైనా ఇలా నేమ్ ప్లేట్ తేడాగా పెట్టుకుని వెళ్తే ఇంటికి చేరే లోపు చలాన్ రెడీగా ఉంటుంది. బడాబాబులకు మాత్రం .. ఇలాంటి చట్టాలు వర్తించవు. అందుకే.. పెళ్లి కాని తాతకు మనవడ్ని కూడా బోర్డులు పెట్టేసుకుని తిరుగుతున్నారు.
2024లో జమిలి ఎన్నికలు లేనట్టే, నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా
మహిళా రిజర్వేషన్ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి
బీజేపీ ఎంపీ మనేకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్
I.N.D.I.A కూటమికే మా ఫుల్ సపోర్ట్, సీట్ షేరింగ్‌పైనా త్వరలోనే క్లారిటీ - కేజ్రీవాల్
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
/body>