పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్స్,లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం మాస్టర్ ప్లాన్
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్స్‌ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
Parliament Winter Session Agenda:
శీతాకాల సమావేశాలు..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు (డిసెంబర్ 3న) విడుదల కానున్నాయి. మిజోరం ఫలితాలూ వెల్లడవ్వాల్సి ఉన్నప్పటికీ ఉన్నట్టుండి ఆ తేదీని డిసెంబర్ 4కి మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం మరో ఉత్కంఠకి తెర తీసింది. డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు (Parliament Winter Session)పిలుపునిచ్చింది. ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చివరి శీతాకాల సమావేశాలు నిర్వహించనుంది. అందుకే...ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలపై ఫోకస్ పెట్టింది. కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న బిల్స్‌ని క్లియర్ చేయాలని చూస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం దాదాపు 18 బిల్స్‌ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది కేంద్రం. జమ్ముకశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించి మహిళా రిజర్వేషన్ చట్టంలో రెండు ప్రొవిజన్స్‌కి సంబంధించిన రెండు బిల్స్‌తో పాటు క్రిమినల్ చట్టాలను రీప్లేస్ చేసే కొత్త బిల్స్‌నీ ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 107 నుంచి 114కి పెంచేందుకు ఉద్దేశించిన బిల్‌పైనా చర్చ జరగనుంది. డిసెంబర్ 4 న మొదలయ్యే శీతాకాల సమావేశాలు 22వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.
ఈ బిల్స్‌పైనే ఫోకస్..
ఇప్పటి వరకూ ఉన్న Indian Penal Code, Code of Criminal Procedure, Indian Evidence Act చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం Bharatiya Nyaya Sanhita, Bharatiya Nagarik Suraksha Sanhita, Bharatiya Sakshya Bill ని తీసుకురానుంది. ఈ మూడు బిల్స్‌నీ ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే ఈ బిల్స్‌ని పరిశీలించింది. జమ్ముకశ్మీర్ Jammu and Kashmir Reorganization Amendment బిల్‌తో పాటు, GSTకి సంబంధించిన రెండో సవరణ బిల్లునీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అఖిలపక్ష సమావేశానికి (All Party Meeting) పిలుపునిచ్చింది. శీతాకాల సమావేశాల అజెండాపై చర్చకు ఆహ్వానించింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఈ అజెండాపై క్లారిటీ ఇవ్వనున్నారు.