Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా ఎందుకు నిలిచిపోయింది? కారణాలేంటి?
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా ఎందుకు ఆమోదం పొందలేకపోయింది?
Women Reservation Bill: చట్టసభ (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ)లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లు 27 ఏళ్లుగా నిలిచిపోయింది. ఈ బిల్లును తొలిసారిగా 1996 సెప్టెంబరులో హెచ్.డి దేవెగౌడ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడంలో విజయం సాధించినా లోక్‌సభలో ఇరుక్కుపోయింది. ఈ బిల్లును పార్లమెంటు లో ఎప్పుడు ప్రవేశపెట్టారు.. ఎవరెవరు ప్రతిపక్షంలో ఉన్నారో ఆ వివరాలిలా ఉన్నాయి.
1996లో బిల్లు ఎందుకు ఆమోదం పొందలేకపోయింది?
హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో కేంద్రంలో 13 పార్టీల కూటమితో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. జనతాదళ్, మరికొన్ని పార్టీల నేతలు బిల్లును వ్యతిరేకించడంతో ఆగిపోయింది.
నితీష్ కుమార్ నిరసన
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత రావడంతో 31 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో బీహార్ సీఎం నితీష్ కుమారు కూడా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకే రిజర్వేషన్లు కల్పించడంపై మాట్లాడుతున్నారని, ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
బిల్లుకు వ్యతిరేకంగా శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
1997 లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. అధికార కూటమిలోనే పార్టీలో ఈ బిల్లును వ్యతిరేకించాయి. శరద్ యాదవ్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. పర్కతి మహిళాన్ అంటూ వ్యాఖ్యానించారు. అంటే దీని వల్ల పట్టణ ప్రాంతాల్లోని పొట్టి జుట్టు ఉన్న మహిళలు మాత్రమే ప్రయోజం పొందుతారని, అలాంటి వారు గ్రామీణ మహిళలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బిల్లు ప్రతులను ముక్కలు ముక్కలు చేశారు
1998లో ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ మధ్యలో ఆర్జేడీ ఎంపీ సురేంద్ర ప్రసాద్ యాదవ్ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి నుంచి బిల్లు ప్రతులను లాక్కొని ముక్కలు ముక్కలు చేశారు. అంబేడ్కర్ తన కలలోకి వచ్చిన అలా చేయమని చెప్పారని అన్నారు.
కాలర్ పట్టుకుని గెంటేశారు
1998 డిసెంబర్ 11న మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో వాగ్వాదం జరిగింది. ఎస్పీ ఎంపీ దరోగా ప్రసాద్ సరోజ్ ను మమతా బెనర్జీ కాలర్ పట్టుకుని కొట్టి సభ నుంచి గెంటేశారు. 2002, 2004, 2008, 2010 లోనూ ఆయన కేంద్ర సర్కారు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేశాయి. 2008లో యూపీఏ సర్కారు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. బీజేపీ, వామపక్షాలు, జేడీయూ పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ ఇప్పటికీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఈ రెండు పార్టీలు యూపీఏలో భాగమే. యూపీఏ ప్రభుత్వం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకపోవడానికి ఇదే కారణం.