News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Parliament Monsoon Session: ఢిల్లీ ఆర్డినెన్స్ సహా 31 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఈ సెషన్ లో మొత్తం 31 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర సిద్ధమవుతోంది.

FOLLOW US: 
Share:

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి జరగనున్నాయి. జులై 20వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ సహా 31 బిల్లులు పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. 17 రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కేంద్ర సర్కారు సన్నద్ధమైంది. వర్షాకాల సమావేశాల్లో.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. మణిపూర్ సంక్షోభం, ఢిల్లీ ఆర్డినెన్స్‌, ద్రవ్యోల్బణం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి కీలక అంశాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. 

పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు

1. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023
2. సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం, 2019
3. DNA సాంకేతిక చట్టం (ఉపయోగం మరియు అప్లికేషన్) నియంత్రణ బిల్లు, 2019
4. మధ్యవర్తిత్వ బిల్లు, 2023
5. జీవ వైవిధ్య (సవరణ) బిల్లు, 2022
6. మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2022
7. రద్దు మరియు సవరణ బిల్లు, 2022
8. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2022
9. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023
10. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (మూడవ సవరణ) బిల్లు, 2022 (హిమాచల్ ప్రదేశ్ కోసం)
11. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు, 2022
12. పోస్టల్ సర్వీసెస్ బిల్లు, 2023
13. నేషనల్ కో-ఆపరేటివ్ యూనివర్సిటీ బిల్లు, 2023
14. పురాతన కట్టడాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు (సవరణ) బిల్లు, 2023
15. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2023
16. అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు బ్యాంక్ బిల్లు, 2023
17. పన్నుల తాత్కాలిక సేకరణ బిల్లు, 2023
18. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 2023
19. నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, 2023
20. డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ బిల్లు, 2023
21. జననాలు మరియు మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023
22. జమ్మూ & కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023
23. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023
24. ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023
25. న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023
26. గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) (సవరణ) బిల్లు, 2023
27. రైల్వేస్ (సవరణ) బిల్లు, 2023
28. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు, 2023
29. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023
30. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023
31. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023

మణిపూర్ పై చర్చకు సిద్ధం

రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చించేందుకు సిద్ధమని కేంద్ర బుధవారం ప్రకటించింది. వర్షాకాల సమావేశాల కోసం వివిధ అంశాలపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాన్‌సూన్ సెషన్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం స్పీకర్ ఆమోదించిన ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, మణిపూర్ లో జరిగిన హింసాకాండపై చర్చించానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జోషి నొక్కి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. 

Published at : 19 Jul 2023 08:15 PM (IST) Tags: Parliament Monsoon Session Monsoon Session 2023 31 Bills during Monsoon Session begins 20th July

ఇవి కూడా చూడండి

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు

Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు

NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్ సమాచారంతో దాడులు

NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్ సమాచారంతో దాడులు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి