Nitin Gadkari Threat Call: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు, హత్య చేస్తామని ఫోన్ కాల్స్‌లో వార్నింగ్
Nitin Gadkari Death Threat Calls: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడంతో నాగ్‌పూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారని అధికారులు తెలిపారు.
Nitin Gadkari Received Death Threat Calls: న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. నాగ్‌పూర్‌లోని గడ్కరీ కార్యాలయానికి శనివారం ఫోన్ కాల్ చేసి హత్య చేస్తామని బెదింపులకు పాల్పడ్డాడు ఓ గుర్తుతెలియని వ్యక్తి. ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి రెండుసార్లు కాల్ చేసిన ఆ వ్యక్తి.. నితిన్ గడ్కరీని చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపు కాల్స్ రావడంతో గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. సీనియర్ పోలీసు అధికారులు గడ్కరీ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రస్తుతం నాగ్‌పూర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. నాగ్‌పూర్‌లోని ఖమ్లా రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఆ వ్యక్తి డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించకుంటే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేస్తామని ఫోన్ కాల్ ద్వారా బెదిరించాడు. దావూద్ పేరు చెప్పిన ఆ నిందితుడు రెండు సార్లు కాల్ చేసి నగదు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన సొమ్ము ఇవ్వకపోతే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేశామని వార్నింగ్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
Maharashtra | Union Minister Nitin Gadkari's office in Nagpur received two threatening calls at 11.30 am and 11.40 am. Further investigation is going on: Nagpur Police
— ANI (@ANI) January 14, 2023
కేంద్ర మంత్రి గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడంపై నాగ్‌పూర్ డీసీపీ రాహుల్ మదనే స్పందించారు. శనివారం నిందితుడు మూడుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. మా క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ చేపట్టింది. మంత్రి గడ్కరీ కార్యక్రమం వేదిక వద్ద కూడా భద్రత పెంచినట్లు డీసీపీ వెల్లడించారు.
నాగ్‌పూర్‌లోని నితిన్ గడ్కరీ ఆఫీసు ల్యాండ్‌లైన్‌కు బీఎస్ఎన్ఎల్ నుంచి శనివారం ఉదయం 11.25, 11.32 & 12.32 గంటలకు మొత్తం మూడు సార్లు నిందితుడు ఫోన్ కాల్ చేశాడు. మాఫియాకు సంబంధించిన దావూద్ పేరు చెప్పిన ఆ వ్యక్తి కొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేసి, అంత మొత్తం చెల్లించకపోతే కేంద్ర మంత్రి గడ్కరీని హత్య చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
There were three phone calls. The details are being found, and our crime branch will work on the CDR. An analysis is underway. Existing security has been increased. Security has also been increased at the venue of the program of minister Gadkari: Rahul Madane, DCP Nagpur pic.twitter.com/5ZnZ3vTpk8
— ANI (@ANI) January 14, 2023