Arangetram Ceremony: కాబోయే కోడలి కోసం ముఖేశ్ అంబానీ ‘అరంగేట్రం వేడుక’ ఆమె నృత్యంతో అంతా ఫిదా - వీడియో
Radhika Merchant Dance: రాధిక మర్చంట్ పారిశ్రామికవేత్త వీరేన్, శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన శైలా మర్చంట్ కుమార్తె. ఈమె చాలా కాలంగా శాస్త్రీయ నృత్యంలో ట్రైనింగ్ తీసుకుంటోంది.
Radhika Merchant Arangetram Ceremony in Mumbai: వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కాబోయే కోడలి కోసం నిర్వహించిన వేడుక కన్నుల వండువగా సాగింది. వారి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ కోసం ఆదివారం నాడు (జూన్ 5) అరగేట్రం పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది.
ఆరంగేట్రం వేడుక అంటే?
ఒక క్లాసికల్ డ్యాన్సర్ తొలిసారిగా అందరి సమక్షంలో వేదికపై ప్రదర్శించే వేడుకను అరాంగేట్రం అంటారు. ఇది తమిళ పదం, అంటే ఒక క్లాసికల్ డ్యాన్సర్ ఫార్మల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత స్టేజ్‌పై అందరి ముందు ప్రదర్శన ఇస్తారు.
రాధిక మర్చంట్ ఎవరు?
రాధిక మర్చంట్ పారిశ్రామికవేత్త వీరేన్, శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన శైలా మర్చంట్ కుమార్తె. ఈమె చాలా కాలంగా శాస్త్రీయ నృత్యంలో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇప్పుడు రాధిక శిక్షణ పూర్తయ్యాక, ఆమె కోసం ఆరంగేట్రం వేడుకను నిర్వహించారు. రాధిక మర్చంట్ నటన, హావభావాలు అందరి హృదయాలను గెలుచుకున్నాయి. అతని నటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
2019లో అనంత్ అంబానీతో రాధిక నిశ్చితార్థం
2019లో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుండి, ఆమె తరచుగా అంబానీ కుటుంబం ఫంక్షన్లలో కనిపిస్తుంది.
సల్మాన్, అమీర్, రణవీర్ సింగ్ హాజరు
సల్మాన్ ఖాన్ నుండి రణవీర్ సింగ్ వరకు, అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ, మీజాన్ జాఫ్రీ, జహీర్ ఖాన్, సాగరిక ఘట్గే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా కూడా పాల్గొన్నారు. శ్లోకా పింక్ కలర్ చీరలో ఆమె కొడుకు పృథ్వీ, భర్త ఆకాష్ అంబానీతో కలిసి కనిపించారు.
అదే సమయంలో మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆదిత్య ఠాక్రే తల్లి, సోదరులతో కలిసి వచ్చారు. చాలా మంది అతిథులు సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారు. మహిళలు బ్రోకేడ్, ఎంబ్రాయిడరీ సిల్క్ చీరలలో ఉండగా, మగవారు షేర్వాణీ, కుర్తాలో కనిపించారు. ఈ సందర్భంగా, అంబానీ కుటుంబ సభ్యులు అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమయంలో, అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను కూడా కచ్చితంగా పాటించారు. కార్యక్రమంలో చేరడానికి ముందు అతిథులందరికీ కోవిడ్ పరీక్షలు జరిగాయి.