Maoist Sudhakar Encounter: మావోయిస్టులకు మరో బిగ్ షాక్- డిఆర్జీ, ఎస్టిఎఫ్ ఆపరేషన్‌లో కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ మృతి
Maoist Sudhakar Encounter: బీజాపూర్ వార్తలు: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లోని నేషనల్ పార్క్ లో గురువారం నాడు జరిగిన ఆపరేషన్ లో ఒక నక్సల్ హతమయ్యాడు.

Maoist Sudhakar Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్క్‌లో DRG,, STF సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు,, 40 లక్షల రూపాయల రివార్డు కలిగిన నక్సల్ సుధాకర్ హతమయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గురువారం నాడు పోలీసు అధికారులు ఈ సమాచారం అందించారు.
భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టుల పెద్ద క్యాడర్ ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాల సంయుక్త బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు వెళ్లిందని అధికారులు తెలిపారు.
భద్రతా దళాల సిబ్బంది ఆ ప్రాంతంలో ఉండగా, ఈ రోజు ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో 40 లక్షల రూపాయల రివార్డు కలిగిన నక్సల్ సుధాకర్ హతమయ్యాడని ఆయన చెప్పారు.
సుధాకర్ అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహాచలం. ఈయన గౌతమ్, సుధాకర్, ఆనంద్, చంటి బాలకృష్ణ, రామరాజు, ఆర్‌ఆర్, అవింద్, సోమన్న పేర్లతో తిరుగుతుంటేవాడు. 30 ఏళ్ల క్రితం ఉద్యమబాటపట్టారు. ఆయన స్వస్థం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి మండలానికి చెందిన ప్రగడవరం. ప్రస్తుతం ఇతని వయసు 66ఏళ్లు.





















