Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్నా పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!
Man's Life Expectancy Is Increase: మనిషి సగటు జీవన ప్రమాణం పెరుగుతోంది. పురుషులకు ఐదేళ్లు, మహిళలకు నాలుగేళ్లు పెరగనున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
![Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్నా పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్! life expectancy to increase to nearly five years by mid-century says Institute of Health Metrics and Evaluation study Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్నా పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/bf02b13ccb0a295e86fe9f8aaa3e64ea1716001287867930_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యూయేషన్(ఐహెచ్‌ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)-2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించింది.
వ్యాధులు ముప్పు పెరుగుదల
ఈ అధ్యయనం ప్రకారం మనిషి సగటు జీవన ప్రమాదనం ఐదేళ్ల వరకు పెరుగుతోంది. అదే సమయంలో వ్యాధులు ముప్పు అధికంగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. గుండె సంబంధిత, కేన్సర్, షుగర్ వంటి వ్యాధులు ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలను ఆయా దేశాల్లోని ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఈ సమస్యలకు చెక్ చెప్పాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా పెరిగిన జీవన ప్రమాణాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చని ఈ పరిశోధన సంస్థ పేర్కొంది.
అధ్యయనంలో తేలిని అంశాలు ఇవే
ఈ సంస్థ చేసిన అధ్యయనంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పురుషుల సగటు జీవితకాలం ఐదేళ్లు పెరుగుతుండగా, మహిళలు జీవితకాలం నాలుగేళ్లు పెరుగుతోంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు జీవితకాలం పెరగనుంది. పూర్తి ఆరోగ్య వంతమైన జీవితకాలం ప్రపంచ వ్యాప్తంగా 2.6 ఏళ్లు పెరగనుంది. 2022లో 64.8 ఏళ్లు ఉండగా, 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవితకాలం 75 ఏళ్లకు కాస్త పెరుగుతుందని, మహిళల్లో అయితే 80 ఏళ్లకు చేరుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. 2050 నాటికి భారత్‌లో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం ప్రపంచ వ్యాప్తంగా 11 వేల సంస్థల సహకారాన్ని తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకుని పరిశోధన చేశారు.
జీవితకాలం పెరగడానికి కారణాలు
ప్రపంచ వ్యాప్తంగా మనిషి జీవితకాలం పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నట్టు పరిశోధన సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెరగడం కారణంగా ఈ అధ్యయన సంస్థ వెల్లడించింది. జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలా వరకు తగ్గుతున్నట్టు గుర్తించినట్టు ఐహెచ్‌ఎంఈ డైరక్టర్ క్రిస్ ముర్రే పేర్కొన్నారు. సగటు జీవితకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరుగుతుందన్నారు. హృద్రోగాలు, కరోనాతోపాటు తీవ్రమైన అంటు రోగాలతోపాటు పౌష్టికాహార లోపం తదితర ఇబ్బందులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండడం కారణంగా ఆయన వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)