Calcutta HC: బంగాల్‌లో చిదంబరం! 'గో బ్యాక్' అంటూ సొంత పార్టీ నేతల నినాదాలు
Calcutta HC: కోల్‌కతా హైకోర్టు ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి నిరసన తగిలింది. సొంత పార్టీకి చెందిన వారే 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
Calcutta HC: కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి బంగాల్‌లో షాక్ తగిలింది. ఓ కేసు వాదించేందుకు కోల్‌కతా హైకోర్టుకు వచ్చిన చిదంబరానికి కాంగ్రెస్ సెల్ న్యాయవాదుల నిరసన సెగ తగిలింది. 'గో బ్యాక్' అంటూ బ్లాక్ రిబ్బన్స్‌ను ధరించి న్యాయవాదులు నినదించారు. చిదంబరం వంటి నేతల వల్లే బంగాల్‌లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని వారు ఆరోపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#WATCH | Congress leader & advocate P Chidambaram faced protest by lawyers of Congress Cell at Calcutta HC where he was present in connection with a legal matter. They shouted slogans, showed him black robes & called him a TMC sympathiser & responsible for party's poor show in WB pic.twitter.com/SlH4QgbJSn
— ANI (@ANI) May 4, 2022
ఎందుకు?
చిదరంబరానికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో స్పష్టంగా తెలియలేదు. అయితే, టీఎంసీ నేతకు సంబంధించిన కేసును వాదించేందుకు ఆయన కోల్‌కతా హైకోర్టుకు వచ్చినట్లు సమాచారం.
2021లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2016లో వచ్చిన దాని కన్నా ఓట్ల శాతం 9 వరకు తగ్గింది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ 44 సీట్లు గెలుచుకున్నది.
2021 ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ 215 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, భాజపా 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.
Also Read: Food Poisoning: కేరళలో షావర్మాతో కమ్మేసిన షిగెల్లా- ఓ బాలిక మృతి, 58 మందికి అస్వస్థత
Also Read: Indian Railway: ఈ రైలులో ప్రయాణం ఉచితం- నో టికెట్, నో ఫైన్- బంపర్ ఆఫర్ అదిరిందిగా!