అన్వేషించండి

Kerala High Court: ఉత్తర్వుల జారీలో AI Tools వినియోగంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం

Artificial Intelligence tools to issue orders | ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయడంలో ఏఐ టూల్స్ ఉపయోగించరాదని కేరళ హైకోర్టు ఆదేశించింది. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

Kerala High Court has directed the courts not to use Artificial Intelligence tools to issue orders

తిరువనంతపురం: కోర్టు తీర్పులు ఇవ్వడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఉపయోగించవద్దని కేరళ హైకోర్టు రాష్ట్రంలోని కోర్టులను ఆదేశించింది. కేసు విచారణలో ఉత్తర్వులు జారీ చేయడానికి కోర్టులు, న్యాయ అధికారులు, ఇతర అధికారుల విషయంలో హైకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. చాట్‌జిపిటి వంటి క్లౌడ్-ఆధారిత AI టూల్స్‌ను తీర్పులు, ఉత్తర్వులు జారీ చేయడానికి ఉపయోగించరాదని కేరళ హైకోర్టు ఆదేశించింది. తమ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సైతం స్పష్టం చేసింది. తీర్మానాలను చేరుకోవడానికి, ఆదేశాలు లేదా తీర్పులను జారీ చేయడానికి AI సాధనాలని ఉపయోగించరాదని కేరళ హైకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

AI Tools మీద సరైన శిక్షణ ఇవ్వాలి

AI టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు లోపాలు తలెత్తుతాయి. కనుక ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్ టూల్స్ వినియోగించకుండా జాగ్రత్త వహించాలని హైకోర్టు ఆదేశించింది. ముందుగా AI సాధనాలను ఉపయోగించడంలో సరైన శిక్షణ పొంది ఉండాలి. ఏఐ టూల్స్ వాడితే తప్పులు జరగవు అని తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం, జ్యుడిషియల్ అకాడమీ లేదా హైకోర్టులో జరిగిన శిక్షణా కార్యక్రమానికి న్యాయమూర్తులు, లాయర్లు, న్యాయ అధికారులు హాజరు కావాలి. అమోదం పొందిన AI సాధనాలను త్వరలోనే వినియోగించే అవకాశం ఉంది.

ఏఐ టూల్స్ లో తప్పిదాలు గుర్తిస్తే ఏం చేయాలి..

ఉత్తర్వులు, తీర్పుల కాపీలో ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారంటే ప్రతి దశలో వాటిపై పర్యవేక్షణ ఉండాలి. అనుమతి ఉన్న AI సాధనాల్లో ఏదైనా తప్పిదం జరిగినట్లు గమనించినట్లయితే, హైకోర్టు ఐటి విభాగానికి సమాచారం ఇవ్వాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ఒక హైకోర్టు ఇతర కోర్టులు, న్యాయమూర్తులకు తీర్పులు, ఉత్తర్వులు జారీ చేయడంలో ఇలాంటి సూచనలు ఇవ్వడం ఇదే మొదటిసారి.

Also Read: PM Kisan Samman Nidhi: త్వరలో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన నగదు, ఈ 2 పనులు వెంటనే పూర్తి చేయండి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget