Idukkki Glass Bridge: భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన, కేరళలోనే - దీని ప్రత్యేకత ఏంటంటే
Idukkki Glass Bridge: కేరళ ప్రభుత్వం ఇడుక్కి జిల్లా వాగమన్ ప్రాంతంలో దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనను ప్రారంభించింది.
Idukkki Glass Bridge: కేరళ ప్రభుత్వం ఇడుక్కి జిల్లా వాగమన్ ప్రాంతంలో అతి పొడవైన గాజు వంతెనను ప్రారంభించింది. అయితే ఈ గాజు వంతెన దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన కావడం గమనార్హం. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కల్పించడానికే కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో, 40 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. అయితే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్ ఈ గాజు వంతెనను నేడు ప్రారంభించారు. ఒకే సారి 15 మంది ఈ వంతెనపై వెళ్తూ.. ప్రకృతిని అస్వాదించవచ్చు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వెంతనకు ప్రవేశ రుసుము 500 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే దీనితో పాటు స్కై వింగ్, స్కై సైక్లింగ్, స్కై రోలర్, రాకెట్ ఇంజెక్టర్, జెయింట్ స్వింగ్ వంటి అనేక సాహసోపేతమైన విన్యాసాల్లో పర్యాటకులు పాలు పంచుకునేలా అడ్వెంచర్ టూరిజం పార్కును ప్రారంభించారు. అయితే ఈ నిర్మాణం కోసం జర్మనీ నుంచి 35 టన్నుల స్టీలును దిగుమతి చేసుకొని వినియోగించినట్లు సమాచారం.
The largest #glassbridge in India Inaugurated at #vagamon.. #keralatourism pic.twitter.com/WDUjR0lt2F
— PA Mohamed Riyas (@riyasdyfi) September 7, 2023
View this post on Instagram