పాకిస్థాన్ వెళ్లిపోండి, ఇది హిందువుల దేశం - ముస్లిం విద్యార్థులకు టీచర్ వార్నింగ్
Karnataka Teacher: కర్ణాటకలో ఓ టీచర్ ఇద్దరు ముస్లిం విద్యార్థులను పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
Karnataka Teacher:
కర్ణాటకలో ఘటన..
కర్ణాటకలో ఓ స్కూల్ టీచర్ ఇద్దరు ముస్లిం విద్యార్థులను "పాకిస్థాన్ వెళ్లిపోండి" అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర విద్యాశాఖ ఈ కామెంట్స్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంది. క్లాస్ చెబుతుండగా ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఇది చూసి అసహనం వ్యక్తం చేసిన ఆ టీచర్ వెంటనే వాళ్లపై అరిచింది. ఆ క్రమంలోనే పాకిస్థాన్‌కి వెళ్లిపోండి అని తిట్టింది. ఇది హిందువుల దేశం అని, ఇక్కడ మీకు చోటు లేదని మండి పడింది. శివమొగ్గలోని ఓ ఉర్దూ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు ఆ టీచర్‌ని మందలించారు. అక్కడి నుంచి బదిలీ చేశారు.
"పిల్లలు గొడవ పడుతుంటే టీచర్ అసహనానికి గురయ్యారు. ఇది హిందువుల దేశం. పాకిస్థాన్‌కి వెళ్లిపోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్నాం. ఆ టీచర్‌ని వేరే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాం. విచారణ కొనసాగుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు తీసుకుంటాం"
- విద్యాశాఖ అధికారులు
యూపీలోనూ ఇదే ఘటన..
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ లోని తృప్తి త్యాగి అనే మహిళా టీచర్ పాఠశాలలోని ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముజఫర్‌నగర్ ఖుబ్బాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదివే ముస్లిం విద్యార్థిని నేహా పబ్లిక్ స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ తృప్తి త్యాగి తోటి విద్యార్థులతో కొట్టించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు స్పందించి స్కూల్ ను మూసేయించింది. అయితే ఈ ఘటనపై పలు వార్తా ఛానళ్లు తృప్తి త్యాగిని వివరణ కోరగా.. ఆమె తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అది చాలా చిన్న విషయమని, దానిని పెద్దది చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని మొదట్లో సమర్థించుకున్న తృప్తి త్యాగి.. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటంతో కాస్త వెనక్కి తగ్గారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్నారు. ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించడం తప్పేనని తాను తప్పు చేశానని క్షమాపణ కోరారు. అలా కొట్టించడం తప్పేనన్న తృప్తి త్యాగి.. అందులో ఎలాంటి హిందూ-ముస్లిం మత విద్వేషం లేదని చెప్పుకొచ్చారు. తానను వికలాంగురాలినని.. లేవలేకపోవడం వల్లే తోటి విద్యార్థులతో కొట్టించినట్లు తెలిపారు.
స్కూల్ మూసివేత...
ఈ వీడియో వైరల్ అవడం వల్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో స్కూల్‌ని బంద్ చేయాలని యోగి సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే విద్యాశాఖ కూడా ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. స్కూల్ బంద్ చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్థానిక పాఠశాలల్లో వాళ్లందరికీ తాత్కాలిక అడ్మిషన్‌లు ఇచ్చారు. మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకూ స్కూల్‌ని ఓపెన్ చేయకూడదని అధికారులు తేల్చి చెప్పారు.
Also Read: సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదం ప్రపంచానికే దిక్సూచి - PTI ఇంటర్య్వూలో ప్రధాని మోదీ