Karnataka Election 2023 Live Updates: మధ్యాహ్నం 3 గంటల సమయానికి 52.03% పోలింగ్
Karnataka Election 2023 Live Updates: 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. మే 13 న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Background
Karnataka Election 2023 Live Updates: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మే 8న సాయంత్రం ముగియగా, మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న విడుదల అవుతాయి. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్ పరీక్షించుకోనున్నారు.
దాదాపు నెల రోజులుగా కాంగ్రెస్, బేజేపీ పోటాపోటీగా ప్రచారం సాగించాయి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. ఆయనతో పాటు అమిత్ షా లాంటి కేంద్ర మంత్రులు, కీలక నేతలు, నటీనటులు సైతం హోరాహోరీగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌లుగా రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ప్రజల్లో ఉత్సాహం నింపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే మరోసారి అవకాశమివ్వాలంటూ మోదీ ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించింది. సీఎం బసవ రాజ్ బొమ్మై పనితీరుపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తున్నా, ప్రధాని మోదీ చరిష్మా కారణంగా కర్ణాటకలో కమలదళం పటిష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటే మాత్రం బీజేపీకి ఇబ్బందులు తప్పవు.
క్యాంపెయినింగ్ చివరి దశకు చేరుకునే సమయానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన తరవాత మాటల యుద్ధం పెరిగింది. బజ్‌రంగ్ దళ్ బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటన అగ్గి రాజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలందరూ దీన్నే ప్రచార అంశంగా మలుచుకున్నారు. కాంగ్రెస్‌కు గురి పెట్టారు. చివరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించి "యూటర్న్" తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొంత మేర కాంగ్రెస్‌పై ప్రభావం చూపించే అవకాశముంది. కాంగ్రెస్ బీజేపీపై "40% కమీషన్" ప్రభుత్వం అని విమర్శలు చేస్తూ ప్రచారం సాగించింది. బసవరాజు బొమ్మై పని తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది. అవినీతి ప్రభుత్వం అంటూ పదేపదే విమర్శలు చేసింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో భారత్ దేశాన్ని ప్రపంచం గుర్తించలేదని, తాము అధికారంలోకి వచ్చాకే దేశ ప్రతిష్ఠ పెరిగిందంటూ జాతీయవాదాన్ని నూరిపోశారు ప్రధాని. కాంగ్రెస్ హయాంలో మొత్తం స్కామ్‌లే జరిగాయని మండి పడ్డారు. బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న హామీపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. జై బజ్‌రంగ్ బలి అనే నినాదాలతో ప్రసంగాలు మొదలు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు. అటు కాంగ్రెస్ కూడా ప్రధాని విమర్శలకు కౌంటర్‌లు ఇచ్చినా...ఖర్గే నోరు జారడం వల్ల కాస్త చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ విషసర్పం అంటూ ఖర్గే చేసిన కామెంట్స్ మిస్‌ఫైర్ అయ్యాయి. చివరకు ఆయనే వివరణ ఇచ్చుకున్నారు.
52.03% పోలింగ్
మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 52.03% పోలింగ్ నమోదైంది.
52.03% voter turnout recorded till 3 pm, in #KarnatakaElections pic.twitter.com/NTUHWz03Sv
— ANI (@ANI) May 10, 2023
ఓటు వేసిన కిచ్చ సుదీప్
నటుడు కిచ్చ సుదీప్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలబ్రిటీలా కాకుండా బాధ్యత గల పౌరుడిగా వచ్చి ఓటు వేసినట్టు వెల్లడించారు.
#WATCH | "Issues are individuals and one should keep their issues in mind and vote accordingly. I've not come here as a celebrity, I've come here as an Indian and it's my responsibility," says Kannada actor Kiccha Sudeep after casting his vote in Bengaluru… pic.twitter.com/CJyYyh6NRp
— ANI (@ANI) May 10, 2023




















