Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి
ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
![Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి Karnataka Accident: Private bus Innova car colloids near kollegala t narasapur area Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/41f4b338a2c508fd2680c7f523bb37961685357435697234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కర్ణాటకలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లేగల - టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై కురుబూరు గ్రామం పింజర పోల్ వద్ద ప్రైవేట్ బస్సు, ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో పది మంది మృతి చెందారు. సోమవారం (మే 29) మధ్యాహ్నం టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై కురుబూరు గ్రామం తర్వాత ఓ ప్రైవేట్ బస్సును ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో ఓ చిన్నారి సహా పది మంది చనిపోయారు.
మృతుల్లో పది మంది బళ్లారికి చెందిన వారని తెలిసింది. టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇన్నోవా కారు డ్రైవర్ నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. టి.నరసీపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై టి.నరసీపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)