నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్
జపాన్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్, సాంకేతిక కళాశాలల్లో చదివే విద్యార్థులతోపాటు రిసెర్చ్ విభాగాల్లో చదువుతున్నవారికి స్కాలర్‌షిప్స్ నిమిత్తం దరఖాస్తులు కోరుతున్నారు.
MEXT Scholarships: జపాన్‌లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(MEXT) ద్వారా ఉపకారవేతనాల కోసం చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. జపాన్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్, సాంకేతిక కళాశాలల్లో మూడు, నాలుగు, అయిదు, సంవత్సరాల కోర్సుల్లో చదివే విద్యార్థులకు ప్రతి నెలా 1,17,000 యెన్(రూ.63,300) సాయం అందుతుంది.
అర్హతలు..
విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు 2000 ఏప్రిల్ 2 లేదా ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలి. క్లాస్-11 లేదా క్లాస్-12లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే వారికి 80 శాతం, సాంకేతిక శిక్షణ కోర్సుల్లో చేరే వారికి 65 శాతం మార్కులు ఉండాలని, జపనీస్ భాషా ప్రావీణ్యం గల వారికి ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తులు..
విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాకి పంపించాలని సూచించింది. ఈ మెయిల్ అనుమతించబోమని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో యూజీ కోర్సుల విద్యార్థులకు జూన్ 22న, సాంకేతిక కళాశాలల్లో శిక్షణ కోర్సుల్లో చేరే విద్యార్థులకు జూన్ 23న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తామని వెల్లడించింది. మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించింది.
చిరునామా:
Culture and Information Section
Consulate General of Japan in Chennai
No 12/1 Cenetoph Road, 1st Street,
Teynampet, Chennai 600018.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తుకు చివరితేది: 27.05.2024.
➥ దరఖాస్తుల పరిశీలన: జూన్, 2024.
➥ అభ్యర్థుల ఎంపికజాబితా: జూన్, 2024 మధ్యలో.
➥ యూజీ విద్యార్థులకు రాతపరీక్ష: 22.06.2024.
➥ టెక్నాలజీ కాలేజీ, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కాలేజీ విద్యార్థులకు రాతపరీక్ష: 23.06.2024.
➥ ఇంటర్వ్యూ: 24.06.2024.
➥ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు: 2024, జులై మధ్యవారంలో.
యూజీ, టెక్నికల్ విద్యార్థుల స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..
రిసెర్చ్ విద్యార్థులకు చేయూత..
యూజీ, ఇతర టెక్నికల్ కోర్సుల విద్యార్థులతోపాటుగా పరిశోధనలను కూడా పెద్దపీట వేస్తున్నారు. రిసెర్చ్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. మే 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఉపకారవేతనాలు 2025 విద్యాసంవత్సరానికి అందుబాటులో ఉన్నాయి.
➥ రిసెర్చ్ విద్యార్థులకు స్కాలర్‌ఫిప్స్
స్కాలర్‌షిప్ వ్యవధి: నాన్-రెగ్యులర్ విద్యార్థులకు 2025 ఏప్రిల్, సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి 2027 మార్చి వరకు స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. రెగ్యులర్ విద్యార్థులకు మాత్రం ఎలాంటి కాలవ్యవధి ఉండదు.
అర్హతలు..
➥ మాస్టర్ డిగ్రీ/ డాక్టోరల్ కోర్సు(ఫేజ్-1)కు సంబంధింత విభాగంలో 70 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 2025 అక్టోబరు బ్యాచ్ విద్యార్థులు 30.09.2025 నాటికి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
➥ డాక్టోరల్ కోర్సుల(ఫేజ్-2)కు సంబంధింత విభాగంలో 70 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 2025 అక్టోబరు బ్యాచ్ విద్యార్థులు 30.09.2025 నాటికి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రాక్టికల్ రిసెర్చ్/టీచింగ్/అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. 02.04.1990 తర్వాత జన్మించిన వారు అర్హులు.
విభాగాలు: హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్, బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్స్, జియోలజీ అండ్ జియో ఇన్‌ఫర్మాటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెటీరియల్ సైన్స్/ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, రోబొటిక్స్, ఐటీ, స్పోర్ట్స్ సైన్స్.
స్కాలర్‌షిప్ ఎంతంటే?
ప్రిపరేటరీ ఎడ్యు కేషన్లోని విద్యార్థులకు మరియు రెగ్యులర్ కాని విద్యార్థులకు నెలకు 143,000 యెన్ (సుమారు రూ.77,358). మాస్టర్స్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీలను అభ్యసించే సాధారణ విద్యార్థులకు నెలకు 144,000 యెన్ (సుమారు రూ.77,902). డాక్టోరల్ డిగ్రీలను అభ్యసించే సాధారణ విద్యార్థులకు నెలకు 145,000 యెన్ (సుమారు రూ. 78,441) ఇస్తారు.
అదనపు అలవెన్స్..
* నమోదు చేసుకున్న కోర్సు ఆధారంగా స్కాలర్‌షిప్ మొత్తం మారుతుంది. ఎంపికైనవారికి నెలకు 2,000 యెన్ (రూ.1082) లేదా 3,000 యెన్ (రూ.1082) స్కాలర్‌ఫిష్‌తోపాటు అదనంగా ఇస్తారు. అయితే చెల్లింపు మొత్తాలు ఏటా మారవచ్చు. గ్రాంటీ ఎక్కువ కాలంపాటు విశ్వవిద్యాలయానికి గైర్హాజరైతే, ఆ సమయంలో స్కాలర్‌షిప్ నిలిపివేయబడుతుంది.
చిరునామా:
Japan Information Centre (JIC),
Embassy of Japan,
50-G, Shantipath, Chanakyapuri,
New Delhi - 110021.
Tel: +91-11-46104865
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తుకు చివరితేది: 03.05.2024.
➥ దరఖాస్తుల పరిశీలన: మే, 2024.
➥ ప్రిలిమినరీ అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ఫలితాలు: మే నాలుగోవారం.
➥ రాతపరీక్ష తేది: 15.06.2024.
➥ ఇంటర్వ్యూ తేది: 15.06.2024 -17.06.2024.