శ్రీనగర్‌లో పోలీస్ అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు, పరిస్థితి విషమం
J&K Police Shot: శ్రీనగర్‌లో పోలీస్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
J&K Police Shot:
ఉగ్రవాదుల కాల్పులు..
శ్రీనగర్‌లో ఓ పోలీస్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనగర్‌లోని ఈద్గాలో ఈ ఘటన జరిగింది. జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీస్ ఆఫీసర్ మసూర్‌పై దాడి జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థతి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని చోట్లా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు.
#WATCH | J&K: Security tightened in Srinagar's Eidgah after a police official was shot. He has been shifted to a hospital pic.twitter.com/Fro4HI7RUz
— ANI (@ANI) October 29, 2023
ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
"ఈద్గా వద్ద ఉగ్రవాదులు పోలీస్ ఆఫీసర్ మసూర్ అహ్మద్‌పై కాల్పులు జరిపారు. వెంటనే ఆ అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. ఓ పిస్టల్‌తో ఈ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాం. తనిఖీలు నిర్వహిస్తున్నాం. కేసు నమోదు చేశాం"
- కశ్మీర్ జోన్ పోలీస్
#Terrorists fired upon & injured Inspector Masroor Ahmad near Eidgah, Srinagar. He was immediately shifted to hospital for treatment. Preliminary #investigation reveals that a pistol was used in this #terror crime. Area cordoned off, case registered.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 29, 2023