Independence Day 2021: 75వ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా నాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసే పుస్తకాలివే
స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్య్రానంతర పరిణామాలు విభజనపై రాసిన పుస్తకాల్లో ప్రతి అక్షరం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి నింపే కొన్ని పుస్తకాల గురించి తెలుసుకుందాం...
1.ఆనందమఠ్ (Anandamath)-బంకిం చంద్ర ఛటర్జీ
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే విధంగా ఎందరో భారతీయుల్లో మేలుకొలుపు ఈ పుస్తకం. బంకిం చంద్ర ఛటర్జీ రాసినదే ఆనందమఠ్. 1770లో బెంగాల్ కరవు సమయంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా రాసిన రచన ఇది. కరవుతో బాధపడుతున్న గ్రామాన్ని విడిచిపెట్టిన మహేంద్ర- కళ్యాణి అనే వివాహిత జంట కథ ఆధారంగా సాగుతుందీ రచన. అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న సన్యాసినులను చూసి స్ఫూర్తి పొందిన మహేంద్ర... వారితో కలసి నడవాలని సిద్ధపడతాడు. భార్య,బిడ్డని వదిలిపెట్టి పూర్తిగా భారతమాత సేవకు అంకితం అవుతాడు. స్వాతంత్య్ర పోరాటానికి ఈ పుస్తకం ఓ టార్చ్ లా పనిచేసింది. బ్రిటీష్ వారు ఈ పుస్తకాన్ని నిషేధించిన తర్వాత కూడా అందులో ఓ పద్యంతోపాటూ... వందేమాతరం అనే నినాదం ఆ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందింది. పద్యం ప్రారంభంలో రెండు చరణాలు స్వాతంత్య్రం అనంతరం మన దేశ జాతీయ గీతంగా మారాయి.
2.ట్రైన్ టు పాకిస్తాన్ (Train To Pakistan)- కుష్వంత్ సింగ్
భారతదేశ విభజన సమయంలో ఖుష్వంత్ సింగ్ రాసిన ట్రైన్ టు పాకిస్తాన్ రచన ఎన్నో ప్రశంసలు పొందింది. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన అల్లర్లలో ఒకటిది. మనో మజ్రా ఒక సిక్కు-ముస్లిం గ్రామం. శతాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్న రెండువర్గాల ప్రజల్ని ఒక్క సంఘటన మార్చేసింది. ఒక రోజు హిందువుల మృతదేహాలతో నిండిన ట్రైన్ పాకిస్తాన్ రావడంతో ఆ గ్రామంలో విద్వేషాలు చెలరేగాయి. అప్పటి నుంచి మారిన పరిస్థితులే ట్రైన్ టు పాకిస్తాన్ పుస్తకం. ట్రైన్ టు పాకిస్తాన్ రచన…విభజన సమయంలో బీభత్సాన్ని…ఆ ప్రభావంతో ప్రభావితమైన ప్రజల జీవితాలను వివరిస్తుంది.
3.వెయిటింగ్ ఫర్ మహాత్మ(Waiting For The Mahatma)- ఆర్.కె.నారాయణ్
మాల్గుడి పట్టణానికి చెందిన శ్రీరామ్ అనే లక్ష్యం లేని ఓయువకుడు…ఆ తర్వాతి కాలంలో స్వాతంత్య్ర సమరయోధుల బృందంలో చేరి బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు గాంధేయ సిద్ధాంతాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడమే ఈ స్టోరీ. గాంధీ వెయిటింగ్ ఫర్ ది మహాత్మ రచనలో ఒక పాత్ర ఇది.
Also Read: కరోనా కారణంగా బయట అడుగు పెట్టే పరిస్థితి లేదంటారా…అయితే ఇంట్లోనే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోండిలా
4.కాంతపుర(Kanthapura)- రాజారావు
బ్రాహ్మణ కులం నివసించే కాంతపుర అనే గ్రామం.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో ఐక్యంగా పాల్గొందని చెప్పే రచన ఇది. మూర్తి అనే ఓ యువ బ్రాహ్మణుడు గాంధేయానికి ప్రభావితమై చదువుకోవడానికి నగరానికి వెళ్తాడు. గ్రామానికి తిరిగొచ్చాక కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడాడనే ఆగ్రహంతో గ్రామ పూజారి బహిష్కరిస్తాడు. ఆ తర్వాత మూర్తి తల్లి హృదయ విదారకంగా మరణిస్తుంది.. భారత పోరాటంతో చురుకుగా పాల్గొన్న మూర్తి వితంతువైన రంగమ్మతో కలసి జీవితం ప్రారంభిస్తాడు. కథ ముగింపులో ప్రజలంతా మూర్తి-రంగమ్మను చూసి ప్రభావితమవుతారు. కాంతాపుర అనేది ఓ మారుమూల గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన అద్భుతమైన చిత్రణ…
5.గోదాన్(Godan), ప్రేమ్ చంద్ , జై రతన్, పి.లాల్
ప్రేమ్‌చంద్ గొప్ప రచనల్లో గోదాన్ ఒకటి. భారతీయ స్వాతంత్య్ర పోరాటం ద్వారా ఒక పేద రైతు ఎలా ప్రభావితం అయ్యాడ. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత లాభాల కోసం ఉద్యమాన్ని ఎలా ఉపయోగించుకున్నారన్నది ఇందులో చూపిస్తారు.. గోదాన్‌లో… ప్రేమ్‌చంద్ క్లాస్, జాతీయ ఐక్యత గురించి వెలుగులోకి తీసుకొచ్చారు.
6.గోరా (Gora), రవీంద్రనాథ్ ఠాగూర్, రాధా చక్రవర్తి
1909లో ప్రచురితమైన గోరాలో… వలస వ్యతిరేక జాతీయవాదం థీమ్ స్పష్టంగా ప్రస్తావించారు. కులం, మతానికి అతీతంగా జాతీయ గుర్తింపు ప్రాముఖ్యతను వివరిస్తుంది.
7. వియ్, ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా (We, The Children of India) లీలా సేథ్
భారతదేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేథ్ రచించిన ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో మన రాజ్యాంగ పీఠికను వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమం ఎందుకు మొదలైంది, స్వాతంత్య్ర పోరాటం, జాతీయ గీతం, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగం ఆవశ్యకత, భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతం చేసే పదాలు వంటి అంశాలపై ఆమె స్పష్టంగా చెప్పారు.
Also Read: ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో దిల్లీ వెళ్లకుండానే మీరూ పాల్గొండి.. ఆ పూర్తి వివరాలు మీ కోసమే
8.- ద ఇండియన్ స్ట్రగుల్ ( The Indian Struggle) సుభాష్ చంద్రబోస్
సుభాష్ చంద్రబోస్ రచించిన… ద ఇండియన్ స్ట్రగుల్ ... 1920-42 మధ్య తన దృష్టిలో భారతదేశం గురించి, మహాత్మా గాంధీ పాత్రను అంచనా వేయడంపై....స్పష్టమైన,వివరణాత్మక పుస్తకం ఇది. భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలి అనుకునేవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
9. ఇండియా ఎట్ 70 (India at 70)- రోషెన్ దలాల్
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వం నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి 70 ఏళ్ల గురించి సంక్షిప్త సమాచారం అందిస్తుంది ఇండియా ఎట్ 70 పుస్తకం. 1947అర్ధరాత్రి నుంచి 70 ఏళ్ల పాటు ప్రధాన సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా వివరించిన పుస్తకం ఇది.
10.ఇండియా విన్స్ ఫ్రీడమ్ (India Wins Freedom) మౌలానా అబుల్ కలాం ఆజాద్
ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఒకరైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినఇండియా విన్స్ ఫ్రీడం అనే పుస్తకం చాలా ఏళ్ల పాటూ ప్రజల దృష్టికి దూరంగా ఉంది. కానీ 1988 లో కోర్టు తీర్పు తర్వాత పూర్తిగా వెలుగులోకి వచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమం, విభజనకు దారితీసిన పరిస్థితులపై ప్రత్యక్షంగా చూసి రాసిన సంఘటనలు కావడంతో..ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.
Also Read: 75వ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమవుతోన్న దేశం