Independence Day 2023: స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలే కాదండోయ్ - ఫ్యామిలీతో ఇండిపెండెన్స్ డే సంబురాలు చేసుకోవచ్చు!
Independence Day 2023: బడులు, ప్రభుత్వ కార్యాలయాలల్లోనే కాకుండా.. కుటుంబ సభ్యులతోనూ స్వాతంత్ర దినోత్సవ సంబురాలు చేసుకోవచ్చు. అన్ని పండుగల్లాగే జాతీయ పండుగను కూడా అందరితో కలిసిన ఆనందంగా చేసుకోండిలా..!
Independence Day 2023: దేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15వ తేదీను 76 సంవత్సరాల క్రితం బ్రిటీష్ వాళ్ల నుంచి మనం స్వాతంత్రం పొందాం. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధులను, మన దేశ చరిత్రను, దాని సంస్కృతిని అలాగే దేశం సాధించిన విజయాలను గుర్తుకు చేస్తూ.. గౌరవించుకుంటుంది. ప్రజలు కూడా సామాజిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు కావడం, త్రివర్ణ పతాకాన్ని లేదా తిరంగను ఎగురవేయడం, కవాతులను చూడటం, పౌరులు దేశభక్తి పాటలు పాడటం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం జాతీయ పండుగగా, అందులోనూ అదేదో ప్రభుత్వ పండగలా మాత్రమే భావిస్తుంటారు చాలా మంది. కానీ మన ఇంట్లోనూ ఈ జెండా పండుగను చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం అంటే బడికో, కాలేజీకో, జెండా ఎగిరేసే చోటుకో వెళ్లడమే కాకుండా.. కుటుంబ సభ్యులతో కలిసి కూడా చక్కగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు. అదెలాగో ఆ వేడుకలు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ వంటకాలు..
కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఇష్టమైన వంటలను తింటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. కలిసి తరచుగా భోజనం చేసే వాళ్ల బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనుకునే వాళ్లు త్రివర్ణ థీమ్ తో వంటకాలను తయారు చేసుకోవచ్చు. అయితే మీ కుటుంబ సభ్యులు తినడానికి ఇష్టపడే వంటకాలను ఎంచుకొని వాటిని త్రివర్ణ పతాకంలోని రంగుల్లో ముస్తాబు చేయండి. చపాతీ, పూరీలకు పాలకూర, క్యారెట్ తురుము అద్దుతూ ఆ రంగుల్లో తయారు చేసుకోవచ్చు. అలాగే చట్నీలు, కర్రీలు, కేక్ లను ఆయా రంగులు వచ్చేలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కేవలం కూరగాయలతో కూడా అంటే కీరదోస, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలతోనూ త్రివర్ణ థీమ్ ను చేసుకోవచ్చు.
లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయండి..
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ మంగళవారం రోజు వస్తోంది. అయితే సోమవారం లీవ్ తీసుకుంటే వీకెండ్స్ తో పాటు స్వాతంత్ర దినోత్సవాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రత్యేక విహార యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నాలుగు రోజుల పాటు విహార యాత్రను ప్లాన్ చేసుకొని.. కుటుంబ సభ్యులతో గడిపితే మరింత ఆనందంగా ఉండొచ్చు. మీకు ఇష్టమైన పానీయాలు తాగుతూ బీచ్‌లో చల్లగా ఉండవచ్చు. అలాగే జెండాలు పట్టుకొని ట్రెక్కింగ్ చేసినా మస్తు కిక్కు వస్తుంది.
దేశభక్తి చిత్రాలు, డాక్యుమెంటరీలు చూడండి..
మనకంటే ముందు వచ్చిన వారు చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. చరిత్ర గురించి తెలుసుకుంటే అందరికీ మంచిదే. కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశభక్తి ఇతివృత్తాలపై మరియు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి సినిమాలు లేదా డాక్యుమెంటరీలను చూడండి. మీరు ఒక్కరే కాకుండా మీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఆ చిత్రాలు చూస్తే మరింత సంతోషంగా ఉంటుంది.
త్రివర్ణ థీమ్ గాలిపటాలు ఎగరవేయండి..
ఉత్తర భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. రోజంతా ప్రజలు తమ డాబాలపై రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, లౌడ్ స్పీకర్లలో దేశభక్తి సంగీతాన్ని వింటారు. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఈ కార్యకలాపాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.
త్రివర్ణ నేపథ్య దుస్తులను ధరించండి..
మీరు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం మీ దుస్తులలో త్రివర్ణ థీమ్‌ను కూడా చేర్చవచ్చు. భారత జెండా షేడ్స్ నుండి రంగును ఎంచుకోండి. లేదా అన్ని షేడ్స్ కలిపి ఉన్న దుస్తులు ధరించండి. మీరు ఈ రంగుల ఆధారంగా యాక్సెసరీలను కూడా ఎంచుకోవచ్చు. ఇలా మీ కుటుంబ సభ్యులంతా ఒకేలాంటి బట్టలు వేసుకొని స్పెషల్ డేను మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోండి.
మన దేశ చరిత్రపై పుస్తకాలు చదవండి..
స్వాతంత్ర్య దినోత్సవ సెలవులను మీ కుటుంబంతో గడపడానికి దేశ చరిత్రను మోసే పుస్తకాలను చదవడం ఉత్తమ మార్గం. మీ ప్రియమైన వారు తమ ఇష్టమైన పానీయంతో ఒక కప్పుతో మంచం మీద ముడుచుకుని ఇంట్లోనే ఉండడాన్ని ఆస్వాదిస్తే, ఇది సరైన మార్గం. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, జలియన్‌వాలా బాగ్, 1919: ది రియల్ స్టోరీ, శశి థరూర్ రచించిన యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్ మరియు మరిన్ని అద్భుతమైన పుస్తకాలను చదివి చరిత్ర తెలుసుకోండి. గుండెల నిండా దేశభక్తిని నింపుకోండి.
దేశభక్తి గీతాలు వినండి..
సినిమాలే కాకుండా దేశం పట్ల గర్వం, ప్రేమను ప్రేరేపించడానికి మీరు ఇంట్లో దేశభక్తి పాటలను కూడా ప్లే చేయవచ్చు. సంగీతాన్ని వింటూ ఆనందించే కుటుంబ సభ్యులు మీలో ఉంటే అది సరదా కార్యకలాపంగా మారుతుంది.