అన్వేషించండి

Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం అంటే మీకు గుర్తొచ్చే విషయాలు ఇవేనా

Independence Day 2023: ఆగస్టు 15 ప్రతి భారతీయుడికి పండుగే. దేశం మొత్తం జరుగుపుకునే పండుగ మాత్రం స్వాతంత్ర్య దినోత్సవం. ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం.

Independence Day 2023: ఆగస్టు 15.. ఈ రోజు ప్రతి భారతీయుడికి పండుగే. దేశంలో హిందువులు దీపావళి, దసరా, వినాయక చవితి జరుపుకుంటారు. ముస్లింలు రంజాన్, బక్రీద్, మొహరం పండుగలు చేసుకుంటారు. క్రిస్టియన్లు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ప్రముఖంగా జరుపుకుంటారు. కానీ దేశం మొత్తం జరుగుపుకునే పండుగ మాత్రం స్వాతంత్ర్య దినోత్సవం. ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం. బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని భారత మాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ స్వతంత్ర భారతావనిగా వెలసిన చారిత్రాత్మక రోజు. బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారత దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది.

బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం పొందిన గుర్తుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశాన్ని 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ ఆధిపత్యం ముగిసిన రోజు ప్రాముఖ్యతకు గుర్తింపుగా పండుగ జరుపుకుంటాం. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ రాజకీయ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1930 జనవరి 26లోనే సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరింది. ఈ తేదీ తరువాత గణతంత్ర దినోత్సవంగా మారింది, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినంగా స్వాతంత్ర్యదినంగా ఆవిర్భవించింది. ఆ రోజు భారతదేశానికి జాతీయ సెలవుదినం. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా దక్కిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎలా జరుపుకుంటారో చూడండి. 

స్వాతంత్ర్య దినోత్సవం చరిత్ర
ఆగష్టు 15, 1947న భారతదేశం మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా అధికారికంగా ప్రకటించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు, అనేక మంది నాయకులు చేసిన అవిశ్రాంత పోరాటం, అహింసా ప్రతిఘటన, త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చింది. 

స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యత
స్వయం పాలన, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, కొత్త శకానికి ప్రతీకగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో ప్రతి భారతీయుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది భారత్ భవిష్యత్తు, భారతీయ ప్రజల స్వేచ్ఛను సూచిస్తుంది. 

ఆగస్టు 15న ఎందుకు జరుపుకుంటారు?
ఆగస్టు 15, 1947 భారత స్వాతంత్ర్య చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఈ చట్టం భారత ప్రజలచే ఎన్నుకోబడిన భారత రాజ్యాంగ సభకు శాసన సార్వభౌమాధికారాన్ని బదిలీ చేసింది. భారత స్వాతంత్ర్య చట్టం జూలై 18, 1947న బ్రిటీష్ పార్లమెంటుచే ఆమోదించబడింది. అనేక సంవత్సరాల పోరాటం ఫలితంగా భారతావనికి స్వాతంత్ర్యం కల్పిస్తూ ఈ చట్టం వచ్చింది. ఇది ఒక చారిత్రక ఘట్టం. బ్రిటిష్ పాలనకు ఇండియాలో ముగింపు పలుకుతూ దేశంలో కొత్త శకానికి నాంది పలికింది.

భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
స్వాతంత్ర్యదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతులు, జెండా ఎగురవేత వేడుకలలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, దేశం యొక్క పురోగతి మరియు లక్ష్యాలను ప్రతిబింబిస్తారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భగా గుర్తొచ్చే కొన్ని అంశాలు

  • జెండా ఎరగవేయడం
  • విద్యార్థులు, రక్షణ దళాల పరేడ్
  • సాంస్కృతిక కార్యక్రమాలు
  • నేతలు, ప్రముఖల ప్రసంగాలు
  • స్వీట్లు,  పండ్లు పంపిణీ
  • దీపాలు వెలిగించడం
  • దేశభక్తి గీతాలు ఆలపించడం
  • దేశభక్తి సినిమాలు చూడడం
  • కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం 

ప్రతి భారతీయుడికి స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకం. ఇది మన దేశం సాధించిన విజయాలకు గర్వించదగిన రోజు. మనమందరం ఈ రోజును ఆనందంగా గొప్పగా జరుపుకుందాం. మంచి భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పని చేద్దాం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Embed widget