Watch Video: వడాపావ్ కాంపిటీషన్‌లో ఓడిపోయిన జపాన్ అంబాసిడర్, ప్రధాని మోదీ ఫన్నీ ట్వీట్
Watch Video: జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి తన భార్యతో కలిసి పుణేలో సరదాగా వడాపావ్ కాంపిటీషన్ పెట్టుకున్నారు.
Watch Video:
పుణేలో హిరోషి పర్యటన..
జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి భారత్ పర్యటనకు వచ్చారు. మహారాష్ట్రలోని పుణేలో సరదాగా తన సతీమణితో కలిసి సందడి చేశారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఆస్వాదించారు. మహారాష్ట్రలో ఫేమస్ అయిన వడాపావ్‌నీ ఎంజాయ్ చేశారు. అంతే కాదు. హిరోషి సుజుకి దంపతులు పోటీ కూడా పెట్టుకున్నారు. "ఎవరు ఎక్కువ వడాపావ్‌లు తింటారో చూద్దాం" అని ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ పోటీలో హిరోషి సతీమణి విన్ అయినట్టు ఫన్నీగా ట్వీట్ చేశారు. "నా వైఫ్ ఈ విషయంలో నన్ను మించిపోయింది" అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పలు చోట్ల ఇద్దరూ కలిసి వడాపావ్ తింటూ కనిపించారు. తన సతీమణి వడాపావ్‌ని వేగంగా తినేస్తుంటే పక్కనే కూర్చుని చూస్తున్నారు హిరోషి. వడాపావ్ ఒక్కటే కాదు. ఇంకా చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్‌ని రుచి చూశారు. అయితే...ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "ఇలాంటి పోటీల్లో ఓడిపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.
"కొన్నిసార్లు ఓడిపోయినా మనకు పెద్దగా బాధ అనిపించదు. అలాంటి కాంపిటీషనే ఇది. మీరిద్దరూ ఇండియన్ ఫుడ్‌ని ఆస్వాదిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇంత ఇన్నోవేటివ్‌గా ప్రజెంట్ చేయడం ఇంకా బాగుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేయండి"
- ప్రధాని నరేంద్ర మోదీ
My wife beat me!🌶#Pune #Kolhapuri pic.twitter.com/JsM1LxcRK5
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) June 10, 2023
This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ
— Narendra Modi (@narendramodi) June 11, 2023
ఇటీవలే జపాన్ ప్రధాని కిషిదా భారత్‌లో పర్యటించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా..ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బుద్ధ జయంతి పార్క్ కు వెళ్లారు. అక్కడ మన ఇండియన్స్ ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ పానీపూరీ గోల్ గప్పాను కిషిదా ట్రై చేశారు. అలా టేస్ట్ చూశారో లేదో వెంటనే ఫిదా అయిపోయారు. అడిగి మరీ మళ్లీ మళ్లీ తిన్నారు. "చాలా బాగుందంటూ" కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.
'Golgappa diplomacy': PM Modi, his Japanese counterpart Fumio Kishida visit Buddha Jayanti Park
— Chittukuruvi (@chittukuruvi4) March 21, 2023
The latest addition to the list of Pani Puri lovers is Japanese Prime Minister Fumio Kishida, who is on a trip to India and arrived in New Delhi 🇮🇳 pic.twitter.com/BuaLOrv64l
Also Read: Meta Layoffs: మాకు నమ్మకం లేదు దొర, జుకర్‌బర్గ్ లీడర్‌షిప్‌పై ఉద్యోగుల అసహనం