Bengal Mamata : దీదీ కవితలకు అవార్డివ్వడం అవమానం - బెంగాల్‌లో సాహిత్య రాజకీయాలు !
మమతా బెనర్జీ రాసిన కవితల పుస్తకానికి బంగ్లా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. ఇది తనకు అవమానం అంటూ గతంలో అవార్డు పొందిన రచయిత్రి తన అవార్డును వెనక్కిచ్చేస్తానని ప్రకటించింది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కవితలు కూడా రాస్తారు. పుస్తకాలు కూడా రిలీజ్ చేశారు. 'కబితా బితాన్' అనే పుస్తకాన్ని మమతా బెనర్జీ కవితలతో ప్రచురించారు. అందులో 900 కవితలు ఉన్నాయి. రవీందన్రాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ 'కబితా బితాన్' అనే పుస్తకానికి ఈ ఏడాదికి గాను సాహిత్య పురస్కారాన్ని పశ్చిమబంగా బంగ్లా అకాడమీ ప్రకటించించింది. ముఖ్యమంత్రి సాహిత్య సాదనను ప్రశంసిస్తూ అకాడమీ ప్రకటన చేసింది. ఈ అంశం బెంగాల్ రాజకీయాలు విమర్శలకు కారణం అయింది. బీజేపీ, తృణమూల్ మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
ఆ మహిళా జర్నలిస్టును సైన్యమే కాల్చి చంపిందా ? ప్రపంచవ్యాప్తంగా దుమారం
అయితే అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలో తనకు శ్చిమబంగా బంగ్లా అకాడమీ ఇచ్చిన సాహిత్య అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని రత్నా రషీద్ బెనర్జీ అనే రచయిత ప్రకటించారు. 2019లో 'అనందా శంకర్ శ్రమక్ సమ్మాన్' పేరిట రత్నా రషీద్‌కు అకాడమీ అవార్డుని ప్రకటించింది. ఆమె జానపద సాహిత్య పరిశోధకురాలు కూడా. తాను అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని.. ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అకాడమీ చైర్మన్ భ్రత్యా బసుకి ఒక లేఖ రాశారు. వెంటనే తన అవార్డుని వెనక్కి ఇవ్వాలని అనుకుంటున్నానని ఆ లేఖలో రత్నా రషీద్ తెలిపారు.
మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుని ప్రదానం చేయడాన్ని తాను అవమానకరంగా భావిస్తున్నానని ఆమె చెబుతున్నారు. ఈ పరిణామం విపరీత పరిస్థితులకు దారితీస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సాహిత్య సాదనను ప్రశంసిస్తూ అకాడమీ చేసిన ప్రకటన సత్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా, రాజకీయ నేతగా మమతాని అభినందిస్తామని, అయితే ఆమె సాహిత్యం కోసం కృషి చేశారన్న వాదనతో తాము ఏకీభవించలేమని ఆమె అంటున్నారు.
ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణకు కేంద్ర మంత్రి సపోర్ట్ - కానీ ట్రంపే వద్దంటున్నారు !
మమతా బెనర్జీకి అవార్డు ప్రకటించడాన్ని బీజేపీ తప్పు పట్టింది. రాజకీయ నాయకురాలైన మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుతో కవులు, రచయితలు అసంతృప్తికి గురయ్యారని బీజేపీ నేతలు చెబుతున్నారు. తమ అధినాయకురాలి దృష్టిలో పడేందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోటీ నడుస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాహిత్యం, సంస్కృతి గురించి బీజేపీ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బీజేపీ తమకు నీతులు చెప్పే అర్హత లేదని తృణమూల్ ఎదురుదాడి చేస్తోంది.