Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్, ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
Har Ghar Tiranga Certificate: అతి త్వరలో స్వాతంత్ర్య దినోత్సవం. మరి మీరు ఇప్పటివరకూ హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ పొందకపోతే, ఇప్పుడు పొందవచ్చు. ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి.
Independence Day 2024 Har Ghar Tiranga: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయింది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభం అయింది. ప్రతి ఇంటిపై జెండాను ఎగుర వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేగాక పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు, స్టేటస్‌లలో జాతీయ జెండాను పెట్టుకోవాలని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగంగా.. harghartiranga.com పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌లో దేశపౌరులు తమ ఫోటోలతో పేరు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరి మీరు ఇందులో భాగస్వాములు అవుతారా? అయితే, ఈ పోర్టల్‌లోకి ఫొటోలు ఎలా అప్‌లోడ్ చేయాలి? సర్టిఫికెట్ ఎలా పొందాలో తెలుసుకుందాం.
ప్రధాని మోదీ ట్వీట్
'హర్ ఘర్ తిరంగ' ప్రచారం నిర్వహించడం ఇది మూడో సారి. ఆగస్టు 15న ప్రతి పౌరుడు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్(X)లో ఓ పోస్టు పెట్టారు. అందులో 'ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని మరలా మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ పిక్చర్ మారుస్తున్నాను. ఈ ప్రచారంలో నాతో పాటు అందరూ చేరాలని అభ్యర్థిస్తున్నాను. మీరు ఆ రోజు సెల్ఫీ దిగి harghartiranga.comలో షేర్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు.
As this year’s Independence Day approaches, let’s again make #HarGharTiranga a memorable mass movement. I am changing my profile picture and I urge you all to join me in celebrating our Tricolour by doing the same. And yes, do share your selfies on https://t.co/0CtV8SCePz
— Narendra Modi (@narendramodi) August 9, 2024
ఎలా అప్ లోడ్ చేయాలంటే..
మీరు కూడా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొనాలనుకుంటే.. మీ ఇంటిపై జెండాను ఎగురవేయాలి. మీరు జెండాను ఎగురవేసి ఓ సెల్ఫీ జెండాతో తీసుకుని Harghartiranga.com కు పంపించాలి. మీరు జాతీయ గీతం పాడుతున్న ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి. సోషల్ మీడియాలోని అన్ని ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా, ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలి.
మొదటగా Harghartiranga.com వెబ్‌సైట్‌లోని హోం పేజీలో 'క్లిక్ పార్టిసిపేట్' ట్యాబ్‌ను ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం, దేశం పలు వివరాలు నమోదు చేయాలి. మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రతిజ్ఞ “I swear that I will hoist the Tricolour, respect the spirit of our freedom fighters and brave sons, and dedicate myself to the development and progress of India.” ను చదవాలి.
ఈ స్టెప్ పూర్తి చేసిన తర్వాత 'టేక్ ప్లెడ్జ్' పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు తిరంగాతో తీసుకున్న సెల్ఫీ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ అంగీకారం అడుగుతుంది. చివరగా సబ్మిట్ చేయాలి. ఈ వివరాలన్ని మీరు నమోదు చేశాకా 'జనరేట్ సెర్టిఫికేట్' పై క్లిక్ చేయాలి.చివరగా డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ షేర్ ఐకాన్ కనిపిస్తుంది. తర్వాత మీ అంగీకారం అడుగుతుంది. చివరగా సబ్ మిట్ చేయాలి. ఈ వివరాలన్ని మీరు నమోదు చేసిన తర్వాత 'జనరేట్ సెర్టిఫికేట్' పై క్లిక్ చేయాలి. చివరగా డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ షేర్ ఐకాన్ కనిపిస్తుంది.
Also Read: Independence Day 2024: ఎర్రకోట పైనే ప్రధాని జెండా ఎందుకు ఎగరేస్తారు- చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా ?