Hijab Ban Verdict: చదువుకోండి ఫస్ట్- మిమ్మల్ని స్కూల్‌కు పంపేది చదువుకోవడానికి: భాజపా
Hijab Ban Verdict: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును భాజపా స్వాగతించింది. అయితే ఇది బాలికల స్వేచ్ఛను హరిస్తుందని మెహబూబా ముఫ్తీ అన్నారు.
Hijab Ban Verdict: హిజాబ్ తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భాజపా నేతలు ఈ తీర్పును స్వాగతించగా, వివిధ ముస్లిం నేతలు కోర్టు వ్యాఖ్యలు బాధించాయని వ్యాఖ్యానించారు.
స్వాగతిస్తున్నాం
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
I welcome the Court's decision. I appeal to everyone that the state & country has to go forward, everyone has to maintain peace by accepting the order of HC. The basic work of students is to study. So leaving all this aside they should study and be united: Union Min Pralhad Joshi https://t.co/xb3BeAYBQm pic.twitter.com/PBzQHqzX9A
— ANI (@ANI) March 15, 2022
ప్రహ్లాద్ జోషితో పాటు, భాజపా నేతలు అశ్విని ఉపాధ్యాయ్, ఎంపీ తేజస్వీ సూర్య, కర్ణాటక మంత్రి కే సుధాకర్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హిజాబ్ నిషేధం వల్ల బాలికలకు చదువుకునేందుకు ఇంకా ఎక్కువ అవకాశాలు కలుగుతాయన్నారు.
నిరాశ చెందాం
Karnataka HC’s decision to uphold the Hijab ban is deeply disappointing. On one hand we talk about empowering women yet we are denying them the right to a simple choice. Its isn’t just about religion but the freedom to choose.
— Mehbooba Mufti (@MehboobaMufti) March 15, 2022
ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ మధ్య దాదాపు 11 రోజుల పాటు హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేసింది. అనంతరం ఈరోజు హిజాబ్ బ్యాన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Also Read: Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?