High Alert At Airports:విమానాశ్రయాల్లో హై అలర్ట్- వంద శాతం ప్రీ-బోర్డింగ్ తనిఖీలకు ఆదేశం
High Alert At Airports:విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. చిన్న లోపం కూడా తలెత్తకుండా చూడాలని పేర్కొంది.

High Alert At Airports: భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలతో విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇప్పుడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకులు సెకండరీ లాడర్ పాయింట్ భద్రతా తనిఖీ (LPSC) లేదా ప్రీ-బోర్డింగ్ తనిఖీ చేయించుకోవాలని ఆదేశించింది. టెర్మినల్ భవనాలకు వెళ్లడాన్ని నిషేధించింది.
విమానాశ్రయాల్లో భద్రతా వ్యవస్థను అలర్ట్ చేసింది. సిసికెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలని ఆయా విమానాశ్రయ నిర్వహాకులను ఆదేశించింది. విమానాశ్రయంలో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు తనిఖీలు ముమ్మరం చేయాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలు లేదని ఆదేశాల్లో పేర్కొంది.
సరైన ఐడీలు ఉన్న వాళ్లను మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు. సరైన గుర్తింపు కార్డు లేకుంటే ఎవర్నీ అనుమతించొద్దని హెచ్చరించింది. ప్రయాణికులు తీసుకొచ్చే లగేజ్‌ను కూడా క్షణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పింది.
పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భద్రతా దృష్ట్యా అన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ట్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌్లు, వైమానిక దళస్టేషన్లు, హెలిప్యాడ్‌లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఏవియేషన్ శిక్షణా సంస్తలను అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. దీన్ని మరింతగా పెంచాలని ఆదేశాలు అందాయి.





















