Gujarat women: ఇదేం వింత! పదేళ్లలో 7సార్లు భర్తను అరెస్టు చేయించింది, భార్యే బెయిల్ ఇప్పిస్తోంది!
గుజరాత్ రాష్ట్రంలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఓ భార్య తన భర్తను ఏకంగా 10 ఏళ్లుగా 7 సార్లు అరెస్టు చేయింది. అంతేకాదండోయ్ అరెస్టు చేయించిన తానే మళ్లీ భర్తకు బెయిల్ కూడా ఇప్పిస్తూ వస్తోంది.
Gujarat women: వివాహ జీవితంలో భార్యభర్తల మధ్య గొడవలు సహజమే. కొన్ని గొడవలు భార్యభర్తలను వేరు చేస్తే మరికొన్ని సర్దుకుపోయి కలిసుండేలా చేస్తాయి. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ భార్యాభర్తల జంట మాత్రం పదేళ్లుగా విచిత్ర కథను నడిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ గృహహింస కింద భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పిస్తూ వస్తోంది. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 10 ఏళ్లలో తన భర్తను 7 సార్లు అరెస్ట్ చేయింది. చివరకు బెయిల్ ఇప్పిస్తూ వస్తుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణంలో ప్రేమ్‌చంద్ మాలి, అతని భార్య సోను దంపతులు నివసిస్తున్నారు. 2001వ సంవత్సరంలో ప్రేమ్ చంద్, సోనూల వివాహం జరిగింది. 2014 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాదాపు 13 సంవత్సరాలు సవ్యంగా సాగిన వీరి జీవితాల్లో విభేదాల కారణంగా ప్రేమ్ చంద్ భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడు.
2015లో తొలి కేసు...
ప్రేమ్‌చంద్, సోనుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 2015లో మొదటిసారిగా సోనూ తన భర్త ప్రేమ్‌చంద్ భౌతిక దాడికి పాల్పడినందుకు కేసు పెట్టింది. ఇదే ఆమె తన భర్తపై పెట్టిన తొలి కేసు. ఇక్కడి నుంచే భర్త ప్రేమ్ చంద్ పై, భార్య సోనూ కేసులు పెట్టడం ప్రారంభించింది. తొలి కేసులో వాదనలను విన్న కోర్టు..భార్య సోనూకు నెలవారీ ఖర్చుల కింద రూ. 2000 భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రోజూవారీ కూలీకి వెళ్లే ప్రేమ్ చంద్ భరణం చెల్లించలేదు. దీంతో మరోసారి అరెస్ట్ చేశారు స్థానిక పోలీసులు. ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత, భార్య సోనూనే తన భర్త కోసం బెయిల్ రెడీ చేసింది. బెయిల్ ద్వారా భర్త ప్రేమ్ చంద్ ను బయటకు తీసుకొచ్చింది. వీరిద్దరు విడివిడిగా జీవితం ప్రారంభించినప్పటికీ, వారి మధ్య సయోధ్య కుదర్చడం, మళ్లీ గొడవలు రావడం పరిపాటిగా మారింది.
మళ్లీ ఒకట్యయారు...
కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు మళ్లీ ఒకటిగా జీవించడం ప్రారంభించారు. ఆ తరువాత కూడా గొడవలు తారాస్థాయికి చేరాయి. ప్రేమ్ చంద్‌పై 2016 నుంచి 2018 వరకు సోనూ నుంచి ఫిర్యాదులు రావడం, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. కానీ ప్రతీసారి అరెస్ట్ చేయించి భార్య సోనూనే అతడికి బెయిల్ ఇస్తూ వచ్చేది. ప్రేమ్ చంద్ 2019, 2020లో కూడా జైలు పాలయ్యాడు. మళ్లీ సోనూనే రక్షించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా భరణం చెల్లించని కారణంగా ప్రేమ్ చంద్ అరెస్ట్ అయ్యాడు. జూలై 4న విడుదలయ్యాడు. అయితే ఇటీవల విడులైన సమయంలో ప్రేమ్ చంద్ పర్సు, మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. ఆ తరువాత మళ్లీ సోనూతో గొడవ జరిగింది. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ప్రేమ్ చంద్ చివరకు ఇంటిని విడిచిపెట్టి పటాన్ లోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయాడు. సోనూ, తన కొడుకు తనకు హాని చేస్తారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.